ETV Bharat / business

ఈ పథకంతో పన్ను ఆదా, పింఛను భరోసా! - ఉద్యోగి

పదవీ విరమణ తరువాత పింఛను రావాలి, ఇటు పన్ను ఆదా పథకంగానూ ఉండాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఒకసారి జాతీయ పింఛను పథకాన్ని పరిశీలించండి.

'ఎన్​పీఎస్​'తో... పన్ను ఆదా... పింఛను భరోసా
author img

By

Published : Jul 15, 2019, 3:17 PM IST

పదవీ విరమణ తరువాత పింఛను రావాలి... ఇటు పన్ను ఆదా పథకంగానూ ఉండాలి అనుకున్నవారు... జాతీయ పింఛను పథకాన్ని (ఎన్​పీఎస్​) పరిశీలించవచ్చు.

18 - 60 ఏళ్లలోపు భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. ఇదో స్వచ్ఛంద పింఛను పథకం. ఈ పథకాన్ని పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ నియంత్రిస్తుంది. ఎన్​పీఎస్​లో కనీస పెట్టుబడి ఏడాదికి రూ.6 వేలు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. పెట్టుబడులను మనకు నచ్చే విధంగా మళ్లించుకునే వీలుంది.

ఈక్విటీ, డెట్​ పథకాలకు పెట్టుబడులను కేటాయించవచ్చు లేదా డిఫాల్ట్​ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. డిఫాల్ట్​ను ఎంచుకున్నప్పుడు ఏటికేడు ఈక్విటీ పెట్టుబడుల శాతాన్ని తగ్గించుకుంటూ వస్తారు. 50 శాతానికి మించి ఈక్విటీ పెట్టుబడులకు అనుమతించరు. ఎన్​పీఎస్​లో ఈక్విటీ పెట్టుబడుల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో... అంటే 10 ఏళ్లకు మించి మదుపు చేసినపుడు కాస్త అధిక రాబడిని ఆశించవచ్చు.

మినహాయింపులు..

ఎన్​పీఎస్​లో మదుపు చేసినప్పుడు రెండు సెక్షన్ల కింద మినహాయింపులు పొందవచ్చు. సెక్షన్ 80-సీ కింద రూ.1,50,000..... సెక్షన్​ 80 సీసీడీ (1బీ) కింద మరో రూ.50,000 వరకు మదుపు చేసి పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే రూ.2 లక్షల వరకూ పన్ను ఆదా చేసుకునేందుకు అవకాశం ఉందన్నమాట. 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నవారికి దీని వల్ల దాదాపు రూ.15 వేలు వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఉద్యోగ సంస్థ కూడా ఉద్యోగి పేరు మీద వేతనం (బేసిక్​+డీఏ)లో 10 శాతం వరకు ఎన్​పీఎస్​లో పెట్టుబడి పెట్టవచ్చు. దీన్ని యాజమాన్యం ఖర్చు పద్దు కింద చూపించుకుని, సెక్షన్​ 80-సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు పొందే వీలుంది.

వ్యవధి ముగిసిన తర్వాత ఎన్​పీఎస్​లో జమైన మొత్తంలో 40 శాతం మేరకు ఎలాంటి పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 60 శాతాన్ని ఇమ్మీడియట్​ యాన్యూటీ పథకాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఎన్​పీఎస్​లో 100 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి సాధ్యం కాదు. కనీసం 40 శాతం మొత్తమైనా యాన్యుటీ పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. మొత్తం డబ్బుతో యాన్యుటీలను కొనుగోలు చేయాలన్నా ఇబ్బందేమీ లేదు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: గురువారం స్వామికి బలపరీక్ష

Intro:Body:

p

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.