ETV Bharat / business

లావాదేవీలు లేకపోతే ఎస్​ఎంఎస్​ పంపితే చాలు.. - cbic

జీఎస్టీ రిటర్న్​ల దాఖలును సీబీఐసీ సులభతరం చేసింది. గతంలో వ్యాపారం చేసినా, చేయకున్నా జీఎస్టీ రిటర్న్​లు దాఖలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వ్యాపార లాావాదేవీలు లేకపోతే కేవలం ఎస్​ఎంఎస్​లు పంపితే చాలని సీబీఐసీ వెల్లడించింది. వ్యాపారం లేకపోతే జీఎస్టీ పోర్టల్​లోకి లాగిన్​ అవ్వక్కర్లేదని తెలిపింది.

now gst returns filing more easier
లావాదేవీలు లేకపోతే ఎస్​ఎంఎస్​ పంపితే చాలు..
author img

By

Published : Jun 28, 2020, 8:42 PM IST

జీఎస్టీ రిటర్న్‌ల దాఖలును కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) మరింత సరళతరం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని ప్రారంభించింది. వ్యాపార లావాదేవీలు లేకపోతే జులై 1 నుంచి ఎస్‌ఎంఎస్‌ పంపాలని సూచించింది. గతంలో వ్యాపారం చేసినా, చేయకున్నా రిటర్న్‌లు దాఖలు చేయాల్సి వచ్చేదని... ఇప్పుడు వ్యాపార లావాదేవీలు లేకపోతే కేవలం ఎస్‌ఎంఎస్‌ పంపితే చాలని స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూరనుంది. వ్యాపారం లేకపోతే జీఎస్టీ పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వక్కర్లేదని సీబీఐసీ తెలిపింది. ఎస్‌ఎంఎస్​ ద్వారా జీఎస్టీఆర్‌ రూపంలో నిల్‌ స్టేట్‌మెంట్‌ పెట్టాలని వెల్లడించింది.

ఎస్‌ఎంఎస్‌ టైప్​ చేసేటప్పుడు... మొదట నిల్‌ స్పేస్​ ఆర్​ 1 స్పేస్​‌ జీఎస్టీఎన్​ నంబర్​ స్పేస్‌ ట్యాక్స్ పీరియడ్ అని టైప్‌ చేసి...14409 నంబర్​​కు ఎస్​ఎంఎస్​ పంపాలని సూచించింది. ఇకపై వ్యాపారం చేయని వారు పన్ను చెల్లింపుదారుల మాదిరి కామన్ పోర్టల్‌లో తమ ఖాతాలోకి లాగిన్ అయ్యి, ప్రతి నెలలో కానీ, ప్రతి మూడు నెలలకొకసారైనా జీఎస్టీఆర్‌-1 ద్వారా తమ వ్యాపార లావాదేవీల వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు నిల్‌ వ్యాపారం ఉన్న జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ పోర్టల్​లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్‌ఎంఎస్‌ పంపిన తరువాత 30 నిమిషాల గడువుతో ఆరు అంకెల కోడ్‌ని సంబంధిత వ్యాపారి పొందుతారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా పన్ను చెల్లింపుదారులు, ఎక్‌నాలెడ్జ్​మెంట్ నెంబరును కూడా పొందుతారని సీబీఐసీ పేర్కొంది.

ఇవీ చూడండి: తస్మాత్​ జాగ్రత్త.. హైదరాబాద్​పై సైబర్ దాడులకు కుట్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.