ETV Bharat / business

కరోనా ప్రభావంతో తగ్గిన వంటగ్యాస్​ ధర - వంట గ్యాస్ ధర

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోతున్న వేళ ఎల్​పీజీ సిలిండర్​పై రూ.53ను తగ్గించింది కేంద్రం. అయితే ఇది రాయితీ లేని సిలిండర్లకు వర్తిస్తుంది. విమాన ఇంధన ధరలు కూడా 10 శాతం పడిపోయాయి.

gas cylinder
గ్యాస్ సిలిండర్​
author img

By

Published : Mar 2, 2020, 6:09 PM IST

Updated : Mar 3, 2020, 4:36 AM IST

అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్​పై కరోనా వైరస్​ ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు తగ్గుతున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత విమానాల ఇంధన ధరలు 10.3 శాతం పడిపోయాయి.

దిల్లీలో విమానయాన​ టర్బైన్​ ఇంధనం(ఏటీఎఫ్​) ధర కిలోలీటర్​కు రూ.6,590.62 తగ్గి.. రూ.56,859కు చేరుకుంది.

వంటగ్యాస్​పై..

రాయితీ లేని వంటగ్యాస్​ ధర రూ.53 తగ్గింది. 14.2 కేజీల సిలిండర్​ ధర రూ.858.5 నుంచి రూ.805.5కు పడిపోయింది.

దేశీయ ఎల్​పీజీ వినియోగదారులకు ఏటా 12 సిలిండర్లను రాయితీపై అందిస్తోంది ప్రభుత్వం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.50 మేర తగ్గి రూ.240కు చేరుకుంది.

వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్​ ధరలు కూడా రూ.1,466 నుంచి 1,381.5కు పడిపోయాయి.

ఇదీ చూడండి: భారత్​లో ఐఫోన్​ మరింత ప్రియం- పెరిగిన ధరలివే..

Last Updated : Mar 3, 2020, 4:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.