లెక్కల్లో చూపని బంగారాన్ని వెల్లడించేందుకు క్షమాభిక్ష పథకం ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. విచారణ బెడదలేకుండా వ్యక్తులు లేదా సంస్థలు తమ వద్ద ఉన్న లెక్కలు చూపని పసిడిని వెల్లడించేందుకు కేంద్రం ఓ పథకాన్ని తేనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చాయి. అలాంటి పథకమేదీ ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని.. బడ్జెట్ ప్రక్రియకు ముందు ఇలాంటి ప్రచారాలు జరగటం సాధారణమేనని పేర్కొన్నాయి.
20 వేల టన్నులు..
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పాక్షికంగా విజయవంతం కావటం వల్ల దాన్ని అధిగమించేందుకు కొత్త పథకాన్ని అమలుచేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. భారతీయుల వద్ద 20 వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అదే లెక్కల్లో చూపని బంగారంతో పాటు పూర్వీకుల నుంచి సంక్రమించినది కలిపితే 25-30 వేల టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: బంగారంపై త్వరలో కేంద్రం సంచలన నిర్ణయం?