ETV Bharat / business

రూ.2వేల నోటుపై కేంద్రం మరోసారి క్లారిటీ

రూ. 2వేల నోట్ల ముద్రణపై స్పష్టతనిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. నోట్ల ముద్రణ నిలిపివేతపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. చలామణి నుంచి రూ. రెండు వేల నోట్లు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల మేరకు లోక్​సభ వేదికగా లిఖితపూర్వకంగా వెల్లడించింది.

Rs 2000 note
'రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై నిర్ణయం తీసుకోలేదు'
author img

By

Published : Sep 19, 2020, 7:46 PM IST

Updated : Sep 19, 2020, 8:26 PM IST

దేశంలో నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లు ఇటీవల చలామణిలో కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో రూ. రెండు వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అశంపై లోక్​సభ వేదికగా స్పష్టతనిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లిఖితపూర్వకంగా తెలిపింది. మార్కెట్​లో డిమాండ్​కు తగినంత నోట్లు చలామణిలో ఉంచేందుకు ఆర్​బీఐతో సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​.

" 2019-20, 2020-21 ఏడాదిలో రూ.2 వేల నోట్ల ముద్రణ కోసం ప్రింటింగ్​ ప్రెస్​లతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కానీ, రెండు వేల నోట్ల ముద్రణ నిలిపివేయంటంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2020, మార్చి 31 వరకు 27,398 రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. అది 2019, మార్చి 31 నాటికి 32,910 ఉన్నాయి."

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర మంత్రి.

కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ కారణంగా రెండు వేల నోట్ల ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇటీవల ఆర్​బీఐ ప్రకటించిందని తెలిపారు ఠాకూర్​. ప్రస్తుతం దశలవారీగా నోట్ల ముద్రణ ప్రక్రియను ముద్రణ కేంద్రాలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు. లాక్​డౌన్​ సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా తమ వద్ద ఉన్న నోట్లను ముద్రణ కేంద్రాలు సరఫరా చేశాయన్నారు.

ఇదీ చూడండి: 'రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రసక్తే లేదు'

Last Updated : Sep 19, 2020, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.