చిన్నమొత్తాల పొదుపు పథకాలపై.. వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. 2020-2021 చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాలపై 4శాతం నుంచి 3.5శాతానికి, పీపీఎఫ్‌పై 7.1 నుంచి 6.4 శాతానికి, ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5 నుంచి 4.4 శాతానికి, సీనియర్ సిటిజన్ల పొదుపు ఖాతాలపై 7.4 నుంచి 6.5శాతానికి వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
గురువారం నుంచి ఈ వడ్డీరేట్లు అమలు కానుండగా.. ఇంతలోనే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఇదీ చదవండి: పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు