ETV Bharat / business

భారత్​కు నీరవ్ మోదీ అప్పగింత! - నీరవ్​ మోదీకి ముంబయి జైలు సరిపోతుంది

पंजाब नेशनल बैंक से करीब दो अरब डॉलर की धोखाधड़ी के मामले में वांछित हीरा कारोबारी नीरव मोदी के भारत प्रत्यर्पण पर लंदन की एक अदालत ने मंजूरी दे दी है.

Nirav Modi can be extradited to India
భారత్​కు నీరవ్​ మోదీ అప్పగింత
author img

By

Published : Feb 25, 2021, 4:29 PM IST

Updated : Feb 25, 2021, 5:08 PM IST

16:26 February 25

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే​ కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్​ను విచారించేందుకు భారత్​కు అప్పగించాలని తీర్పు వెలువరించింది.

భారత్​కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్​ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్​కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

నీరవ్​కు ముంబయి ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ బ్యారక్​ సరిపోతుందని పేర్కొంది కోర్టు. అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది.

Last Updated : Feb 25, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.