సులభతర వాణిజ్యానికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనువైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకింగ్‌లను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మార్చిలో విడుదల చేయనుంది. ఈ నివేదిక 2018కి చెందిన ర్యాంకులకు సంబంధించినది.
"ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాల ర్యాంకింగ్... ఈ ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల అవుతుంది. ఎన్నికల కారణంగా ఇది ఆలస్యమైంది."
- ఓ అధికారి, వాణిజ్య, పరిశ్రమల శాఖ
మెరుగైన వ్యాపార వాతావారణాన్ని సృష్టించుకుని.. దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాష్ట్రాల మధ్య పోటీని ప్రేరేపించడమే ఈఓడీబీ ర్యాంకులు ఇవ్వడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
2018లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
2018 జులైలో విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ, హరియాణా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తరువాతి స్థానాల్లో వరుసగా ఝార్ఖండ్ (4), గుజరాత్ (5), ఛత్తీస్‌గఢ్ (6), మధ్యప్రదేశ్ (7), కర్ణాటక (8), రాజస్థాన్ (9), బంగాల్ (10) ఉన్నాయి.
ర్యాంకింగ్ ఇలా
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సులభతర వాణిజ్యం కోసం చేపట్టిన సంస్కరణలు వివరాలు, లబ్ధిపొందిన వ్యాపారులు, లేదా సంస్థల నుంచి వచ్చిన ప్రతిస్పందనల (ఫీడ్‌బ్యాక్) ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు.
63వ స్థానానికి మెరుగు
ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నివేదికలో భారత్ 63వ స్థానంలో నిలిచింది. మొత్తం 190 దేశాలు గల ఈ జాబితా గతంలో ఉన్న 77న స్థానం నుంచి భారత్ 14 స్థానాలు మెరుగుపడి 63వ స్థానానికి చేరుకుంది. భారత్ మరికొన్నేళ్లలో మొదటి 50 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి: ఇరాన్ సెగ: పెట్రోల్, డీజిల్ ధరల భగభగ