ETV Bharat / business

వాట్సాప్ వేదికగా కొత్త తరహా సైబర్ మోసం - వాట్సాప్ వేదికగా కొత్త తరహా సైబర్ మోసం

వాట్సాప్ వేదికగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ఆన్​లైన్​లో తమ వస్తువులు అమ్మకానికి పెట్టేవారిని నేరగాళ్లు లక్ష్యం చేసుకుంటున్నారు. వస్తువులు కొంటామనే నెపంతో క్యూఆర్ కోడ్​లను పంపించి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. తస్మాత్​ జాగ్రత్త.

new kind of cyber crime through whatsapp
వాట్సాప్ వేదికగా కొత్త తరహా సైబర్ మోసం
author img

By

Published : Dec 29, 2019, 8:01 AM IST

సైబర్​ నేరగాళ్లు ముదిరిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెండుగా ఉన్న వీరు.. మూసపద్ధతులను పక్కనపెట్టి వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు. అత్యంత చాకచక్యంగా మీతో మిమ్మల్నే మోసగిస్తున్నారు.

వాట్సాప్​లో మాయాజాలం

ఆన్​లైన్​లో తమ వస్తువులు అమ్మేవారిని సైబర్​ నేరగాళ్లు లక్ష్యం చేసుకుంటున్నారు. మొదటగా మీ వస్తువు వారికి బాగా నచ్చిందని, కొనడానికి సిద్ధంగా ఉన్నామని నమ్మబలుకుతారు. అమ్మకానికి పెట్టినవారు తమ వస్తువులు త్వరగా అమ్ముడుపోతున్నాయనే ఉత్సాహంలో నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు.

డబ్బులు పంపిస్తామని..

తరువాత సైబర్​ నేరగాళ్లు డబ్బులు పంపిస్తామని నమ్మకంగా చెబుతారు. మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వాట్సాప్ నెంబర్​ అడుగుతారు. మీరిచ్చిన వివరాలు తీసుకున్న తరువాత.. మీ వాట్సాప్ ఖాతాకు ఓ క్యూఆర్​ కోడ్ పంపిస్తారు. దీనిని స్కాన్​ చేస్తే నగదు మీ ఖాతాలో పడుతుందని చెబుతారు.

నిజానికి వారు పంపే క్యూఆర్​ కోడ్​ మీ నుంచి నగదు అభ్యర్థిస్తూ పంపించే కోడ్​. పొరపాటున దానిని స్కాన్ చేసారో.. మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యి వారి ఖాతాలో పడపోతుంది. అంతే మీ డబ్బు ఢమాల్​ అవుతుంది.

తస్మాత్​ జాగ్రత్త

వాట్సాప్ ద్వారా జరిగే ఇలాంటి మోసాల పట్ల అవగాహన అవసరం. అందుకే క్యూఆర్ కోడ్​లను స్కాన్ చేసేముందు సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీలకు మధ్య ఉండే తేడా గమనించాలి. 'సెండ్ మనీ' అంటే మీ ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు; 'రిక్వెస్ట్ మనీ' అంటే మీ ఖాతా నుంచి నగదు అభ్యర్థిస్తున్నట్లు. మీరు పొరపాటున వారి ట్రాప్​లో పడ్డారంటే మీ ఖాతా నగదు మాయమయినట్లే.

'క్యూఆర్​ కోడ్' అనేది అంతర్జాలంలో లభించే వెబ్​పేజ్​ తరహా లింక్​. దీనిని ఎవరైనా సులభంగా క్రియేట్ చేయవచ్చు. కనుక మనకు అవగాహన లేని ఇలాంటి లింక్​ల జోలికి, క్యూఆర్ కోడ్​ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

ఇదీ చూడండి : టెలికాం సంస్థల పర్యవేక్షణకు మంత్రుల బృందం

New Delhi, Dec 28 (ANI): Boxing champion Mary Kom defeated Nikhat Zareen on December 28 in the finals of the ongoing Women's Boxing Olympic trials in the 51-kg weight category. After the bout, Mary Kom didn't shake hands with opponent Nikhat Zareen. Speaking about the incident, Zareen said, "I did not like how she (Mary Kom) behaved with me, because when the decision was announced and I tried to hug her, she did not hug me back. Being a junior I expect from seniors that they respect juniors too, so I felt hurt." After the match, Mary Kom remarked, "Why should I shake hands with her? If she wants others to respect her then she should first respect others. I don't like people with such nature"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.