ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభతరం చేయడంతోపాటు, మొబైల్ ఫోనులోనూ ఉపయోగించుకునేలా ఇ-ఫైలింగ్ 2.0 కొత్త పోర్టల్ రానుంది. ఇప్పటి వరకూ ఉన్న వెబ్‌సైటు స్థానంలో జూన్ 7 నుంచి http:///incometax.gov.in అందుబాటులోకి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
ఇందులో ముందుగానే పూర్తి చేసిన ఐటీ ఫారాలు ఉంటాయి. ఇ-ఫైలింగ్ 2.0 పోర్టల్‌లో కొత్త మొబైల్ యాప్ కూడా ఉండబోతోంది. ఇందులో రిటర్నులను ఎలా దాఖలు చేయాలనే అంశాలపై వీడియోలు, ఇతర సమాచారమూ ఉంటుందని పేర్కొంది. జూన్ 1 నుంచి 6 వరకూ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్‌లో వెల్లడించింది.
ఇదీ చూడండి: వాటిపై జీఎస్టీ మినహాయింపునకు కేంద్ర బృందం ఏర్పాటు!