డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన వాట్సాప్‌కు మోదీ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. కొత్త మార్గదర్శకాలను నిరాకరించటం ధిక్కరణ చర్యే అవుతుందని స్పష్టం చేసింది.
ప్రైవసీ హక్కును భారత ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపింది కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. కొత్త డిజిటల్ నిబంధనలు సాధారణ కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని పేర్కొంది. మధ్యంతర మార్గదర్శకాలను సవాల్ చేయటం వాటిని అమలులోకి రాకుండా అడ్డుకునేందుకు చేసిన దురదృష్టకర చర్య అని తెలిపింది.
"ఒకవైపు ప్రైవసీ పాలసీని తప్పనిసరి చేసిన వాట్సాప్, వినియోగదారుల సమాచారాన్ని తన మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటోంది. మరోవైపు.. తప్పుడు వార్తలు, శాంతిభద్రతలకు సంబంధించి తప్పనిసరైన మార్గదర్శకాలను తిరస్కరించేందుకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో చేసే ఎలాంటి ఆపరేషన్ అయినా.. దేశంలోని చట్టాలకు సంబంధం ఉంటుంది. మార్గదర్శకాలను వాట్సాప్ నిరాకరించటం ధిక్కరణ చర్యే."
- కేంద్ర ఐటీ శాఖ
ఐటీ చట్టం నిబంధనల మేరకు సురక్షితమైన ప్లాట్‌ఫాంగా వాట్సాప్ ఉండాలని స్పష్టం చేసింది కేంద్రం. గోప్యత హక్కుకు విరుద్ధమని కొత్త మార్గదర్శకాలను చిత్రీకరించటానికి వాట్సాప్ చేసిన ప్రయత్నం తప్పుదారి పట్టించేదేనని పేర్కొంది.