ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ త్వరలోనే గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టనుందని సమాచారం. అందుకోసం అనుభవజ్ఞుడైన ఎగ్జిక్యూటివ్‌ని నియమించుకోవాలని భావిస్తోంది. వీడియో స్ట్రీమింగ్ వ్యాపారంలో పోటీ తీవ్రతరం అవుతుండటం వల్ల సంప్రదాయ వ్యాపారం నుంచి ఇతర రంగాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు.
కరోనా మహమ్మారి వేళ ఇంట్లోనే ఉంటోన్న గేమర్ల నుంచి పెరిగిన డిమాండ్‌తో గేమింగ్ పరిశ్రమకు లాభాల పంట పండుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిశ్రమలో అనుభవం ఉన్న అధికారులను నెట్ ఫ్లిక్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం.
గతంలోనూ..
'బ్లాక్ మిర్రర్', 'యూ వర్సెస్ వైల్డ్' లాంటి సినిమాలతో గతంలో ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్‌తో ప్రయోగం చేసింది నెట్ ఫ్లిక్స్. దీంతో పాత్ర కదలికలను ప్రేక్షకులే నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది. అదే కాకా, 'స్ట్రేంజర్ థింగ్స్', 'మనీ హీస్ట్' షోల ఆధారంగా గేమ్స్ ను డిజైను చేసింది.
ఆపిల్‌కు చెందిన చందా ఆధారిత గేమింగ్ యాప్ ఆర్కేడ్ తరహాలోనే బోలెడన్ని ఆటలను వినియోగదారులను అందించాలని నెట్‌ఫ్లిక్స్ యోచిస్తోంది. అందులో ప్రకటనలు ఉండవని తెలుస్తోంది.
ఇదీ చూడండి: నెట్‌ఫ్లిక్స్.. అరచేతిలో మల్టీప్లెక్స్!