ETV Bharat / business

ఇన్నోవేషన్​లో దేశానికే తెలంగాణ ఆదర్శం: కేటీఆర్ - Minister ktr on Women Innovation

మహిళా స్టార్టప్​లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్... గుజరాత్​లోని ఐ-హబ్​లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వర్చువల్​గా జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఉమెన్ ఇన్నోవేషన్‌కు దేశవ్యాప్త గుర్తింపు: కేటీఆర్‌

author img

By

Published : Jan 16, 2021, 7:18 PM IST

ఇన్నోవేషన్ రంగంలో దేశంలోని పలు రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాటను నిజం చేస్తూ మహిళా ఇన్నోవేషన్​కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్య ఒప్పందంతో ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్​లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్... గుజరాత్​లోని ఐ-హబ్​లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

కుదిరిన ఒప్పందం...

ఈ ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్టప్​లను ఎంపిక చేసి, వాటికి అవసరమైన అన్ని రకాల చేయూతను అందించనున్నారు. తద్వారా ఆయా స్టార్టప్​లు మరింత మూలధనాన్ని అందిపుచ్చుకోవటమే కాక, అవసరమైన మెంటర్ షిప్ వీరికి దొరకనుంది.

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, గుజరాత్ విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రులు భూపేంద్ర సిన్హా, విభావరి బెన్​దవేల సమక్షంలో వీహబ్ సీఈవో దీప్తిరావుల, తెలంగాణ, గుజరాత్​కు చెందిన సీనియర్ అధికారులు ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

వర్చువల్ సమావేశం
వర్చువల్ సమావేశం

వీహబ్ ఆదర్శం...

దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇన్నోవేషన్ రంగంలో, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వీ-హబ్ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ద్వారా భవిష్యత్తులో కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు రాష్ట్రాలకు చెందిన మహిళా స్టార్టప్​లకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

ఇవాళ జరిగిన ఒప్పందం నిజమైన ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో, కేవలం సామర్థ్యమే ప్రామాణికంగా మహిళా ఇన్నోవేషన్ మరింత ముందుకు పోతోందని కేటీఆర్ అన్నారు

ఇదీ చదవండి : 'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.