దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో సారి భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 'వెల్త్ హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020' నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం ముకేశ్ సంపద విలువ రూ.6.58 లక్షల కోట్లుగా ఉంది.
గత 12 నెలల్లో ముకేశ్ సంపద ఏకంగా 73 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ పేర్కొంది. దీనితో ఆయన ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.
ఈ జాబితాలో.. హిందుజా సోదరులు (ఎస్పీ హిందుజా ముగ్గురు సోదరులు) రెండో స్థానంలో(సంపద రూ.1.43 లక్షల కోట్లు), హెచ్‌సీఎల్‌టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ మూడో స్థానంలో (సంపద రూ.1.41 లక్షల కోట్లు) నిలిచారు. గౌతమ్ అదానీ, కుటుంబ సభ్యులు, అజీమ్ ప్రేమ్‌జీలు వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.
హరూన్ రిచ్ లిస్ట్లోలో.. రూ.32,400 కోట్లతో స్మితా వి క్రిష్ణ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. కిరణ్ మంజుందార్ (రూ.31,600 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు.
ఇదీ చూడండి:గూగుల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?