ఆన్లైన్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించే దిశగా దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ అడుగులు వేస్తోంది. మరో ఆరు నెలల్లో ఆ సంస్థకు చెందిన జియో మార్ట్ సేవలను ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన వాట్సాప్‌లో అందుబాటులోకి తేనుంది. తద్వారా 40 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులకు జియో మార్ట్ చేరువై... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలకు సవాల్‌గా మారనుంది.
200 నగరాల్లో..
2020 మేలో ప్రారంభమైన జియో మార్ట్ 200 నగరాల్లో సేవలు అందిస్తోంది. గతేడాది ఫేస్‌బుక్‌తో 5.7 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిన కొద్ది రోజులకు ఈ యాప్‌ను విపణిలోకి ప్రవేశపెట్టారు. వాట్సాప్ ద్వారా జియో మార్ట్ సేవలు ప్రస్తుతం కేవలం ముంబయికే పరిమితం కాగా ఇప్పుడు దేశమంతటా విస్తరించనున్నాయి.
ఇదీ చదవండి : వాట్సాప్ అప్డేట్ కథేంటి..? ప్రత్యామ్నాయాలివే..