Mukesh Ambani Cars: దిగ్గజ వ్యాపావేత్త, అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత విలాసవంతమైన కార్లను అందించే రోల్స్ రాయ్స్ సంస్థకు చెందిన కల్లీనన్ కారును కొనుగోలు చేశారు. ధీని ధర రూ. 13.14 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరు మీద ఈ కారు గతనెల 31న రిజిస్టర్ అయినట్లు దక్షిణ ముంబయి ఆర్టీఓ అధికారులు వెల్లడించారు.
కారులో మార్పులకు అన్ని రూ.కోట్లా?
2018లో వచ్చిన ఈ మోడల్ కొనుగోలు ధర రూ.6.95 కోట్లు. కానీ ఆ కారులో తమకు అనుగుణంగా మార్పులు చేయించుకోవడం వల్ల ఇంత మొత్తం అయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'టస్కాన్ సన్' అనే ప్రత్యేకమైన రంగును ఈ కారుకు సంస్థ ఎంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2.5 టన్నుల బరువు ఉండే ఈ కారు 564 హార్స్‌పవర్‌తో దూసుకెళ్తుందని తెలిపారు.
కారు రిజిస్ట్రేషన్ నెంబరు 0001తో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఫ్యాన్సీ నంబరు కోసం రూ.12 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : జుకర్‌బర్గ్‌ను వెనక్కి నెట్టిన అంబానీ, అదానీ