దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలించిన తర్వాత తాము కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి పొందుతామని అనేక మంది భారతీయులు అశలు పెట్టుకున్నారు. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సాస్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని వారు.. ఉద్యోగం తిరిగి వస్తుందని ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు సర్వే పేర్కొంది.
మరిన్ని విషయాలు...
- 6రంగాలపై ఈ సర్వే జరిగింది.
- 73శాతం మంది పట్టణ ప్రాంత భారతీయులు లాక్డౌన్ తర్వాత ఉద్యోగం తిరిగి వస్తుందని ఆశిస్తున్నారు.
- అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లలో మిశ్రమ స్పందన వచ్చింది.
- అత్యధికంగా ఫ్రాన్స్‌లో 69శాతం మందిలో ఆంక్షలు ఎత్తివేసినా..ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు.
- ఫ్రాన్స్ తర్వాత స్పెయిన్(62 శాతం), దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా(61 శాతం) ఉన్నాయి.