2020లో 81 శాతం భారతీయ కంపెనీలు తమ సమాచారం దోపిడీకి గురైందని ఓ సర్వేలో అంగీకరించినట్లు సైబర్ భద్రతా సంస్థ బార్రాకుడ శుక్రవారం వెల్లడించింది. అందుకు జీరో డే వల్నరబిలిటీ, భద్రతా లోపాలే ప్రధానకారణమని వివరించింది. బార్రాకుడ తరఫున ఈ ప్రపంచవ్యాప్త సర్వేను స్వతంత్ర మార్కెట్ రీసెర్చర్ వాన్ సన్ బోర్న్ నిర్వహించింది. 100 మంది అప్లికేషన్ భద్రత అధికారుల నుంచి వారి సంస్థ వివరాలను ఈ సర్వే సేకరించింది.
"అప్లికేషన్లో లొసుగుల కారణంగా గత ఏడాది కాలంలో 81 శాతం సంస్థల్లో డేటా చోరీ జరిగింది. వెబ్ అప్లికేషన్ వల్నరబిలిటీ లేదా జీరో డే వల్నరబిలిటీ వల్ల సంస్థల్లో భద్రతా ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని 52శాతం మంది తెలిపారు."
- మురళి ఉర్స్, బార్రాకుడ ఇండియా మేనేజర్
500 మంది ఉద్యోగులకుపైగా ఉన్న సంస్థల్లో ఈ సర్వేను నిర్వహించారు. కొంతకాలంగా ఇంటర్నెట్ ఆధారిత పనులను విస్తృతమైన కారణంగా సమాచార దోపిడీ ఘటనలు అధికమవుతున్నాయని సర్వే పేర్కొంది.
ఇదీ చూడండి: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్.. ఇక సెలవు