ETV Bharat / business

స్విస్​బ్యాంక్​ సొమ్ముల్లో పడిపోయిన భారత్​ ర్యాంక్

స్విస్​బ్యాంక్​లో భారత్​ నిల్వలు గణనీయంగా పడిపోయాయి. 2018లో 74వ స్థానంలో ఉన్న భారత్​.. 2019 నాటికి మూడు స్థానాలు కోల్పోయింది. స్విస్​ నేషనల్​ బ్యాంక్​ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. బ్రిటన్​ తొలిస్థానంలో కొనసాగుతుండగా, అమెరికా ఆ తర్వాతి స్థానంలో ఉంది.

Money in Swiss banks: India at 77th place, accounts for just 0.06% of all foreign funds
స్విస్​బ్యాంక్​లో దాచుకున్న సొమ్ములో భారత్​ ర్యాంక్​ 77
author img

By

Published : Jun 26, 2020, 1:42 PM IST

Updated : Jun 26, 2020, 2:13 PM IST

దేశ పౌరులు, సంస్థలు స్విస్​ బ్యాంకులో దాచుకున్న నిల్వల్లో భారత్​​.. మూడు స్థానాలు పడిపోయి 77వ స్థానానికి చేరింది. ఈ విషయంలో 2018లో 74వ స్థానంలో ఉండేది భారత్​. గతేడాదితో పోలిస్తే 2019 నాటికి బ్యాంకు నిధులు కూడా 0.01 శాతం తగ్గాయి. 2019లో మొత్తం విదేశీ నిధుల్లో మన దేశం వాటా 0.06 శాతంగా ఉంది. ఈ మేరకు స్విట్జర్లాండ్​ నేషనల్​ బ్యాంక్​(ఎస్​ఎన్​బీ)తాజా విషయాలను వెల్లడించింది.

భారత్​కు సంబంధించి మొత్తం రూ. 6,625 కోట్ల నిధులు స్విస్​ బ్యాంక్​లో ఉన్నట్లు ఎస్​ఎన్​బీ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ.

టాప్​-5 ఇవే..

ఈ విషయంలో బ్రిటన్​ 27శాతం నిల్వలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్​, ఫ్రాన్స్​, హాంగ్​కాంగ్​లు వరుసగా ఉన్నాయి. మొత్తం నిల్వల్లో టాప్​-5 దేశాలే సుమారు 50 శాతం నిల్వలను కలిగిఉండగా.. టాప్​-10 దేశాలు మూడింట రెండో వంతు సొమ్మును దాచాయి. తొలి 15 స్థానాల్లోని దేశాల మొత్తం విలువ 75 శాతంగా ఉంటుందని ఎస్​ఎన్​బీ తెలిపింది.

పొరుగు దేశాలూ అంతే..

పొరుగు దేశాలూ భారత్​ కంటే దిగువ స్థాయిలోనే ఉన్నాయి. బంగ్లాదేశ్​-85, పాకిస్థాన్​-99వ ర్యాంకుల​తో టాప్​-100లో చోటు దక్కించుకోగా.. నేపాల్​- 118, శ్రీలంక-148, మయన్మార్​-186, భూటాన్​-196 స్థానాల్లో ఉన్నాయి.

గతంలో మాదిరి గోప్యత ప్రదర్శించని కారణంగా.. ఇటీవలి కాలంలో స్విస్​ బ్యాంకులో నిధులు గణనీయంగా పడిపోయాయి.

ఆ దేశాల్లో మాత్రం వృద్ధి..

2019లో సెంట్రల్​ ఆఫ్రికన్ రిపబ్లిక్​ మాత్రం ఏకంగా 3,600 శాతంతో అత్యున్నత పెరగుదల నమోదుచేసింది. అంతేకాకుండా ఇరాక్​ 500 శాతం, ఉత్తర కొరియా 110 శాతం వృద్ధితో టాప్​-10 లో చోటు దక్కించుకున్నాయి. అయితే.. మాల్దీవులు మాత్రం ఏకంగా 97 శాతం పతనమైంది.

స్విట్జర్లాండ్‌ బ్యాంక్​లో భారతీయులు కలిగి ఉన్న నల్లధనం పరిమాణాన్నిఈ గణాంకాలు సూచించవు. భారతీయులు, ప్రవాస భారతీయులు, ఇతరులతో పాటు మూడవ దేశ సంస్థల పేర్లతో కలిగి ఉన్న డబ్బును కూడా ఈ నివేదిక తెలియజేయదు.

ఇదీ చదవండి: 'చైనీయులకు గదులివ్వం.. భోజనం పెట్టం'

Last Updated : Jun 26, 2020, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.