రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్లు... వీటన్నింటి ధరలు త్వరలో పెరగనున్నాయి. ఆయా ఉత్పత్తులు విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వినియోగదారులు వాడే ఈ సాధనాలు మరింత ప్రియం కానున్నాయి.
అయితే బంగారం, వెండి ధరలు మాత్రం కిందకు దిగిరానున్నాయి. దిగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీని కేంద్రం హేతుబద్ధీకరించిన నేపథ్యంలో వీటి ధరలు తగ్గనున్నాయి.
తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అంశాల ప్రకారం ఏ పరికరాల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో చూద్దాం.
ధరలు పెరిగేవి ఇవే
- రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో ఉపయోగించే కంప్రెసర్లు
- ఎల్ఈడీ దీపాలు, వాటి విడి భాగాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు
- ముడి సిల్క్, కాటన్
- సోలార్ ఇన్వర్టర్లు, లాంతర్లు
- వాహన విడిభాగాలు(సేఫ్టీ అద్దాలు, విండ్స్క్రీన్ వైపర్లు, సిగ్నలింగ్ పరికరాలు)
- మొబైల్ ఫోన్ విడిభాగాలు(పీసీబీఏ, కెమెరా మాడ్యూల్, కనెక్టర్లు, బ్యాక్ కవర్లు, సైడ్ కీస్)
- మొబైల్ ఫోన్ ఛార్జర్ విడి భాగాలు
- లిథియం-అయాన్ బ్యాటరీకి కావాల్సిన ముడి పదార్థాలు
- ఇంక్ కార్ట్రిడ్జ్లు, ఇంక్ స్ప్రే నాజిల్స్
- తోలు ఉత్పత్తులు
- నైలాన్ ఫైబర్, నూలు
- ప్లాస్టిక్ బిల్డర్ వస్తువులు
- పాలిష్ చేసిన సింథటిక్ రాళ్లు, పాలిష్ చేసిన క్యూబిక్ జిర్కోనియా
ధరలు తగ్గేవి ఇవే
- బంగారం, బంగారు కడ్డీలు
- వెండి, వెండి కడ్డీలు
- ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు
- అంతర్జాతీయ సంస్థలు, దౌత్య కార్యాలయాలు దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు
ఇదీ చదవండి: బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు