ETV Bharat / business

మొబిక్విక్ యూజర్ల డేటా లీక్​- నిజమెంత? - మొబిక్విక్​ లేటెస్ట్​ వార్తలు

వినియోగదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను మొబిక్విక్​ ఖండించింది. ఈ విషయంపై తాము దర్యాప్తు చేశామని, ఎటువంటి భద్రతా లోపాలు కనిపించలేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఈ సంస్థ తొలి పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు వివరణ ఇచ్చింది.

MobiKwik denies data breach of 3.5 mn users amid IPO plans
డేటా లీకేజీ వార్తలను ఖండించిన మొబిక్విక్
author img

By

Published : Mar 30, 2021, 11:45 AM IST

భారత్​కు చెందిన ప్రముఖ డిజిటల్​ వ్యాలెట్​, పేమెంట్స్ కంపెనీ మొబిక్విక్‌ ఈ ఏడాది సెప్టెంబర్​లో తొలి పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు 200 నుంచి 250 మిలియన్​ డాలర్లు సేకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో వినియోగదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది ఆ సంస్థ.

వినియోగదారులకు సంబంధించిన సమాచారం సమారు 8.2 టీబీ లీకైనట్లు సైబర్​ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్​ రాజహరియా, ఫ్రెంచ్ పరిశోధకుడు ఇలియట్​ అల్డర్​సన్​ ట్వీట్​ చేశారు. యూజర్​లకు సంబంధించిన ఫోన్​ నంబర్​లు, ఈమెయిల్స్​, పాస్​వర్డ్​లు, చిరునామాలు, బ్యాంక్ ఖాతాలు, వివిధ కార్డుల వివరాలు మొత్తం అందులో ఉన్నాయని తెలిపారు.

అయితే వారి ఆరోపణలను మొబిక్విక్ ఖండించింది. ఈ విషయంపై తాము దర్యాప్తు చేశామని, ఎటువంటి భద్రతా లోపాలు కనిపించలేదని స్పష్టం చేసింది. వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని పేర్కొంది. పరిశోధకులు అని చెప్పుకునే తిరిగే వారు తమ సంస్థ, మీడియా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది.

ఇప్పటివరకు ఇదే అతి పెద్ద కేవైసీ డేటా లీకేజీ అని అల్డర్​సన్ ట్వీట్​ చేశారు. మరో వైపు రాజహరియా 11 కోట్ల మంది భారతీయుల కార్డు డేటా లీకైనట్లు ట్వీట్​ చేశారు. ఇందులో పాన్​, ఆధార్​ కార్డు వివరాలు కూడా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: జొమాటో ఐపీఓ.. వచ్చే నెల సెబీకి దరఖాస్తు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.