ఈ ఏడాది చివరికల్లా లింక్డ్ఇన్ సేవలను చైనాలో నిలిపివేస్తున్నట్లు మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బీజింగ్ అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని పేర్కొంది. సెన్సార్‌షిప్ నియమాలను(Microsoft Linkedin China Censorship) చైనా మరింత కఠినతరం చేయడమే ఇందుకు ముఖ్యకారణమని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వివరించింది.
"చైనా తీసుకొచ్చిన సెన్సార్‌షిప్ నియమాలు (Microsoft Linkedin China Censorship) మాకు మరింత సవాలుగా మారాయి. ఇటువంటి పరిస్థితుల నడుమ సేవలను కొనసాగించడం కష్టం."
- మైక్రోసాఫ్ట్
చైనాలో ఇప్పటికే లింక్డ్ఇన్.. ఇన్జాబ్స్ పేరుతో లోకలైజ్ చేసిన యాప్‌ను విడుదల చేసింది. ఇందులో లింక్డ్ఇన్లో ఉండే కెరీర్ నెట్వర్కింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ దానిలో సోషల్ ఫీడ్, పోస్ట్‌లు, ఆర్టికల్స్‌ను షేర్ చేసేందుకు అవకాశం ఉండదు. దీనికి తోడు మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన సెర్చ్ ఇంజిన్ బింగ్, లింక్డ్ఇన్లతో పాటు మరో వందకుపైగా యాప్‌లలో సరైన సమాచారం లేదని.. దానిని తొలగించడం లేక సరిచేసుకోవాలని చైనా ఇంటర్నెట్ వాచ్డాగ్ ఆదేశించింది.
2014లోనే లింక్డ్ఇన్ చాలా సింపుల్‌గా ఉండేలా చైనీస్ భాషలో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. లోకలైజ్ చేయడం వల్ల దేశంలో వినియోగం ఎక్కువగా పెరుగుతుందని భావించింది. కానీ ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌కు అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా చేయడం వల్ల కంటెంట్ అనేది సెన్సార్ (Microsoft Linkedin China Censorship) చేయవలసి ఉంటుంది. దీంతో వ్యక్తులకు సంబంధించిన కీలకమైన అంశాలు కూడా బయటకు వస్తాయి. వ్యక్తుల డేటాను కాపాడటానికి కావాల్సిన చర్యలను తీసుకునే క్రమంలో ఈ నిర్ణయం ఎంచుకుంది మైక్రోసాఫ్ట్.
2016లో లింక్డ్ఇన్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.
ఇదీ చూడండి: జీ ఎంటర్టైన్మెంట్తో రిలయన్స్ విలీన ప్రతిపాదన రద్దు