టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఇప్పటికే కంపెనీ సీఈఓగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. బోర్డు ఛైర్మన్ పదవికి స్వతంత్ర డైరెక్టర్లు.. బుధవారం నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రకటించింది.
ఛైర్మన్‌గా ఆయన.. మైక్రోసాఫ్ట్‌లో వ్యూహాత్మక పాత్ర పోషించనున్నారు. బోర్డు సమీక్షలు సహా విధివిధానాలను నిర్ణయించనున్నారు.
ఇప్పటివరకు ఛైర్మన్‌గా ఉన్న.. జాన్ డబ్ల్యూ థామ్సన్ ఇకపై ప్రధాన స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించారు. ఆయన 2012-14 మధ్య ఇదే బాధ్యతల్లో కొనసాగారు.
డివిడెండ్.
ఆయా కీలక పదవుల్లో మార్పులు చేయడమే కాక.. మైక్రోసాఫ్ట్ షేర్లకు త్రైమాసిక డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుకు 0.56 డాలర్లుగా నిర్ణయించింది.
2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్నారు నాదెళ్ల. సుదీర్ఘ కాలం ఆ విధులు నిర్వర్తించిన స్టీవ్ బామర్ స్థానంలో.. నాదెళ్లను ఎంపికయ్యారు. అప్పట్లో ఒక భారతీయుడికి, అదీ తెలుగువారికి ఆ అవకాశం లభించడం గర్వించదగ్గ విషయం. అంతకుముందు ఆయన.. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
సత్య నాదెళ్ల హైదరాబాద్‌లోనే జన్మించారు. వీరి తల్లిదండ్రులది అనంతపురం. నాదెళ్ల తండ్రి యుగంధర్.. కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యునిగా, ప్రధాన మంత్రి కార్యదర్శిగానూ పనిచేశారు.
అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయుల సారథ్యం..
సత్య నాదెళ్ల సహా పలువురు భారత సంతతి వ్యక్తులు.. అంతర్జాతీయంగా ఎన్నో టెక్ దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు.
- భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా ఉన్నారు.
- అజయ్ బంగ- మాస్టర్‌కార్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
- శంతనూ నారాయణ్- అడోబ్ సిస్టమ్స్ సీఈఓ
- అర్వింద్ కృష్ణ- ఐబీఎం ఛైర్మన్, సీఈఓ
ఇదీ చూడండి: భారత్‌కు అండగా ఉంటామని పిచాయ్, నాదెళ్ల హామీ