ETV Bharat / business

అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ వాచ్​ రివోల్వ్​ యాక్టివ్​ - comercial news

చైనా దిగ్గజ సంస్థ షియోమీ.. ఎంఐ వాచ్​ రివోల్వ్​ సిరీస్​లో మరో కొత్త స్మార్ట్ వాచ్​ను తీసుకువచ్చింది. ఎంఐ వాచ్​ రివోల్వ్​ యాక్టివ్​ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. గత మోడల్​ కన్నా ప్రస్తుత స్మార్ట్​వాచ్​లో అదిరపోయే ఫీచర్లెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Mi Watch Revolve Active
ఎమ్​ఐ వాచ్​ రివోల్వ్​ యాక్టివ్​
author img

By

Published : Jun 22, 2021, 5:59 PM IST

Updated : Jun 22, 2021, 6:26 PM IST

చైనా దిగ్గజ సంస్థ షియోమీ.. ఎంఐ వాచ్​ రివోల్వ్​ యాక్టివ్​ పేరుతో మరో కొత్త స్మార్ట్​ వాచ్​ను విడుదల చేసింది. గ్లొనాస్​, గెలీలియో, బైదు నావిగేషన్​తో పాటు ఇన్​బిల్ట్​ అలెక్సా​ సదుపాయం ఉంది. ఫైబర్​ పాలీమెరైడ్​ గ్లాస్​తో తయారు చేసిన 1.39 అంగుళాల ఎమోల్డ్ స్క్రీన్​ ఉంది. 5 ఏటీఎమ్​ వాటర్​ ఫ్రూఫ్​ రేటింగ్​తో 14 రోజులపాటు బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

ఫీచర్స్..

  • 1.39 అంగుళాల ఎమోల్డ్ స్ర్కీన్​, డీఎల్​సీ కోటింగ్​తో గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​
  • ఆండ్రాయిడ్​ 4.4 తో పాటు, ఐఓఎస్​ 10 కి కూడా కనెక్ట్ అయ్యేలా బ్లుటూత్​ 5.0 సదుపాయం
  • కొలతలు​..45.9x53.35x11.8, బరువు.. 32.5 గ్రాములు
  • 14 రోజుల లైఫ్​ ఇచ్చేలా 420 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ
  • హార్ట్​ రేట్​ సెన్సార్​, గైరొస్కోప్​, జియో మాగ్నెటిక్ సెన్సార్, బారో మెట్రిక్​ సెన్సార్​, లైట్​ సెన్సార్లు
  • ఫిట్​నెస్​ ట్రాకింగ్​, రక్తంలో ఆక్సిజన్​ కొలత, వాయిస్​ అసిస్టెంట్​ విత్​ మైక్రోఫోన్, మ్యూజిక్​ కంట్రోల్​, కెమెరా షట్టర్​
  • 117 స్పోర్ట్స్​ మోడ్స్​ అందుబాటులో ఉన్నాయి. గత మోడల్​ కన్నా పది మోడ్స్​ అధికంగా ఉన్నాయి.

ధర ఎంతంటే.

బ్లాక్​, నావీ బ్లూ కలర్​లలో లభించే ఈ వాచ్​.. రూ.9999లకు ఎమెజాన్​ ప్రైమ్​, ఎంఐ.కామ్​, ఎంఐ హోమ్​ స్టోర్​లో జూన్​ 25 నుంచి లభిస్తుంది. పరిమిత కాలంలో రూ.8999లకే అందుబాటులో ఉండనుంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కార్డ్స్​ యూజర్స్​కి రూ.750 డిస్కౌంట్​తో రూ.8249కి లభిస్తుంది.

ఇదీ చదవండి:విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 26శాతం వృద్ధి!

ప్రపంచ ట్యాబ్లెట్ మార్కెట్లో యాపిల్​, శాంసంగ్ జోరు!

Last Updated : Jun 22, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.