ETV Bharat / business

బెంజ్​ కార్లలో లోపం- 6.6 లక్షల యూనిట్లు రీకాల్​

author img

By

Published : Jul 5, 2020, 3:54 PM IST

ఆయిల్​ లీకేజీ సమస్య తలెత్తొచ్చనే అంచనాలతో చైనాలో 6.6 లక్షల కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్​ బెంజ్. ఈ ఏడాది డిసెంబర్​లో కార్లను వెనక్కి రప్పించే ప్రక్రియ ప్రారంభం కానుంది.

benz recall
బెంజ్ భారీ రీకాల్​

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్​ బెంజ్​ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఆయిల్ లీకేజీ లోపం తలెత్తొచ్చనే అంచనాలతో.. ఈ ఏడాది చివరి నుంచి 668,954 కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే చైనాలో మాత్రమే కార్లను రీకాల్​ చేయాలని భావించడం గమనార్హం.

2013 డిసెంబర్​ నుంచి 2017 జూన్ మధ్య తయారైన సీ-క్లాస్​, ఈ-క్లాస్​, వీ-క్లాస్​, జీఎల్​కే-క్లాస్, సీఎల్​ఎస్​-క్లాస్ సహా పలు ఇతర మోడళ్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి. చైనా మీడియా కథనం ప్రకారం డిసెంబర్​ 18న రీకాల్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్లన్నింటికీ డీలర్లు ఉచితంగానే రీప్లేస్​మెంట్ చేయనున్నారు.

రీకాల్​ పరిధిలో ఉన్న వాహనాలు దాదాపు అన్ని చైనాలో తయారైనవే. 36 వేల యూనిట్లను మాత్రం దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:స్వదేశీ 'ఎలిమెంట్స్​' యాప్​ ఫీచర్స్ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.