ETV Bharat / business

​​​​మెక్​డొనాల్డ్స్‌ సమాచారం హ్యాక్‌! - మెక్‌డొనాల్డ్స్ సంస్థపై హ్యాకింగ్ వార్తలు

మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులు, ఫ్రాంచైజీల వ్యాపార సమాచారం హ్యాకింగ్​కు గురైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. అమెరికా సహా.. దక్షిణ కొరియా, తైవాన్‌లోని వినియోగదారుల డేటా లీక్​ అయినట్లు పేర్కొంది.

MCDONALDS
​​​​మెక్‌ డొనాల్డ్స్‌ సమాచారం హ్యాక్‌!
author img

By

Published : Jun 12, 2021, 6:56 AM IST

పెద్ద పెద్ద కంపెనీలే లక్ష్యంగా హ్యాకింగ్‌ పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు మరో ప్రముఖ కంపెనీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద బర్గర్‌ చైన్‌ మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన సమాచారం హ్యాకింగ్‌ గురైందని ఆ కంపెనీ వెల్లడించింది. అమెరికా, కొరియా, తైవాన్‌కు వ్యాపార కార్యకలాపాలకు చెందిన సమాచారం తస్కరణకు గురైనట్లు పేర్కొంది. కంపెనీకి చెందిన అంతర్గత భదత్రలో అనధికారిక కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు ఇటీవల నియమించుకున్న కన్సల్టెంట్లు జరిపిన పరిశోధనలో ఈ విషయం బహిర్గతం అయినట్లు కంపెనీ పేర్కొంది.

అయితే, ఇది రాన్సమ్‌వేర్‌ తరహాదాడి కాదని కంపెనీ పేర్కొంది. తస్కరణకు గురైన సమాచారంలో కస్టమర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు, కొంతమంది ఉద్యోగుల సమాచారం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థలతో పాటు, వినియోగదారులకు కూడా తెలియపరుస్తామని తెలిపింది. వినియోగదారుల పేమెంట్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని పేర్కొంది.

ఇవీ చదవండి: ఆన్​లైన్​లో 50 కోట్ల ఫేస్​బుక్​ యూజర్ల డేటా

భారత్‌ 'పవర్​'‌పై డ్రాగన్‌ గురి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.