ETV Bharat / business

కార్ల వారంటీ, ఫ్రీ సర్వీస్ గడువు పొడిగింపు

author img

By

Published : May 12, 2021, 6:05 PM IST

కరోనా రెండో దశ ఉద్ధృతితో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో.. కార్ల కంపెనీలు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించాయి. ఉచితంగా అందించే సర్వీస్​తో పాటు.. వారంటీ వ్యవధిని పొడిగించాయి. ఈ మేరకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టొయోటా కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.

Maruti, Tata, Toyota extend free service and warranty
మారుతీ టాటా టొయోటా

రెండోదశ కరోనా విజృంభణ నేపథ్యంలో 2021 జూన్ 30 వరకు ఫ్రీ సర్వీస్​తో పాటు వారంటీని పొడిగించినట్లు దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బుధవారం ప్రకటించింది. మార్చి 15 నుంచి మే 31 వరకు ముగిసే ఫ్రీ సర్వీస్, వారంటీ కాలానికి ఈ పొడిగింపు వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

"అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్​డౌన్​తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పొడిగింపుతో మా వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది. ఆంక్షల సడలింపు అనంతరం వారి తీరిక మేరకు ఈ సేవలను పొందవచ్చు."

-పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సర్వీస్)

టొయోటా..

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా సైతం.. కరోనా సమయంలో వారంటీ, ఉచిత సర్వీస్​ను ఒక నెల పొడిగిస్తున్నట్లు తెలిపింది. 'కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్ 2.0' ప్రీ-పెయిడ్ సర్వీస్ ప్యాకేజీలనూ పొడిగించింది.

"'కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్ 2.0' ద్వారా మా విలువైన కస్టమర్లలో విశ్వాసాన్ని నింపుతాం. నిబద్ధతను చాటుకునేందుకు టొయోటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది"

-నవీన్ సోని, టొయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్

టాటా మోటార్స్..

కరోనా సమయంలో టాటా మోటార్స్ సైతం తమ వినియోగదారుల సౌలభ్యం కోసం పలు చర్యలను చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 1-మే 31 మధ్య కాలంలో ప్రయాణీకుల వాహన వినియోగదారులకు వారంటీ, ఉచిత సర్వీసును జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది.

తమ కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాల పరిరక్షణకు 'బిజినెస్ ఎజిలిటీ ప్లాన్'ను రూపొందిస్తున్నట్లు టాటా మోటార్స్ ఇటీవల ప్రకటించింది.

ఇవీ చదవండి: 2025 నాటికి 15 విద్యుత్ కార్లు: టొయోటా

ఆక్సిజన్ కొరత తీర్చేందుకు మారుతీ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.