దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. ఏప్రిల్ నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. మార్చి నెలలో వివిధ మోడళ్లపై ఆఫర్లను ప్రకటించిన దిగ్గజ సంస్థ.. ఉత్పత్తి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పెంపు ద్వారా.. వినియోగదారులపై కొంత భారం పడుతుందని, అయితే ముడిపదార్థాల ధరలు పెరిగినందునే పెంపు అనివార్యమని పేర్కొంది సంస్థ. ఆయా మోడళ్లను బట్టి ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఇంతకుముందు కూడా ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా రూ.34 వేల వరకు పెంచనున్నట్లు జనవరి 18న మారుతీ ప్రకటించింది.
ఇదీ చదవండి: బంపర్ ఆఫర్లను ప్రకటించిన మారుతీ సుజుకి