ETV Bharat / business

'నేను గెలిస్తే స్టాక్​ మార్కెట్లు రాకెట్​లా దూసుకెళ్తాయి' - ట్రంప్ భారత పర్యటన రెండో రోజు

అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జిస్తాయని జోస్యం చెప్పారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మార్కెట్లు రాకెట్​లా దూసుకెళ్తాయని వ్యాఖ్యానించారు.

Trump
ట్రంప్
author img

By

Published : Feb 25, 2020, 4:47 PM IST

Updated : Mar 2, 2020, 1:05 PM IST

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిల్లీలో పలు దిగ్గజ సంస్థల సారథులతో సమావేశమయ్యారు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో వాణిజ్యానికి సంబంధించిన విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడారు ట్రంప్.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

"మేం గెలిస్తే స్టాక్​ మార్కెట్లు గతంలో మాదిరిగానే రాకెట్​లా దూసుకెళ్తాయి. అంతకంటే ఎక్కువే కావచ్చు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

సరైన వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని, లేదంటే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు ట్రంప్. భారత్​తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులు దాటాల్సి ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి: భాజపాకు షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బిహార్'​ తీర్మానం

Last Updated : Mar 2, 2020, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.