ETV Bharat / business

బడ్జెట్ అంచనాలు​, క్యూ3 ఫలితాలే మార్కెట్లకు కీలకం!

కేంద్ర బడ్జెట్​, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లను దిశా నిర్దేశం చేయనున్నాయి. జనవరి నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ వారం కాస్త ఒడుదొడుకులకు అవకాశముందంటున్నారు విశ్లేషకులు.

Stocks Outlook
స్టాక్ మార్కెట్​ ఔట్​లుక్​
author img

By

Published : Jan 24, 2021, 12:34 PM IST

రికార్డు స్థాయిల నుంచి వెనక్కి తగ్గిన స్టాక్ మార్కెట్లు.. ఈ వారం కూడా కాస్త ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం, వారంలో నాలుగు రోజులే మార్కెట్లు పని చేయనుండటం, కేంద్ర బడ్జెట్​పై అంచనాలు వంటివి ఇందుకు కారణం కావొచ్చంటున్నారు.

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (జనవరి 26) మార్కెట్లకు సెలవు.

కంపెనీల త్రైమాసికాల ఫలితాల ప్రభావం, అమెరికా ఫెడ్​ ద్రవ్య విధాన నిర్ణయాలూ మార్కెట్లపై ప్రభావం చూపొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యాక్సిస్ బ్యాంక్​, మారుతీ సుజుకీ, లుపిన్​, హెచ్​యూఎల్​, టాటా మోటార్స్, బ్యాంక్​ ఆఫ్​ బరోడా సహా పలు దిగ్గజ సంస్థలు ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ప్రభావం ఆయా షేర్లపై ప్రధానంగా ఉండనుందని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.

'బడ్జెట్​పై అంచనాలు, అమెరికా నూతన ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయొచ్చు.' అని జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్​ పరిశోధన విభాగాధిపతి వినోద్​ నాయర్ పేర్కొన్నారు.

వీటన్నింటితో పాటు కరోనా అప్​డేట్స్, రూపాయి, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:'బీమా అవసరాన్ని కరోనా గుర్తు చేసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.