ఐటీ మినహా లోహ, ఎఫ్ఎంసీజీ, విద్యుత్తు రంగాల్లో కొనుగోళ్లు క్షీణించిన కారణంగా.. స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి సూచీలు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లో మొదట నష్టాలు.. తర్వాత లాభాలు నమోదై.. వెంటనే మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఇలా ఫ్లాట్‌గా కొనసాగుతోందీ సూచీ. ప్రస్తుతం స్వల్పంగా 12 పాయింట్లు కోల్పోయి.. 37 వేల 316 వద్ద ఉంది.
జాతీయ స్టాక్ ఎక్సేంజి సూచీ 11 వేల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. మొదట.. 30 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ... అనంతరం ఫ్లాట్ ట్రేడింగ్‌తో 11 వేల ఎగువకు చేరింది. ప్రస్తుతం.. నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి.. 11 వేల మార్కు ఎగువనే ఉంది.
269 షేర్లు పుంచుకున్నాయి. 376 షేర్లు డీలాపడ్డాయి. 26 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
లాభనష్టాల్లోనివివే...
బయోకాన్, ఆలెంబిక్ ఫార్మా, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్‌లు లాభాలను నమోదు చేశాయి.
బ్రిటానియా, యెస్ బ్యాంక్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. హిందాల్కో, టాటా మోటర్స్, వేదాంత, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి..
రూపాయి నేటి ఆరంభ ట్రేడింగ్‌లో స్వల్పంగా 17 పైసలు మెరుగుపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 71.54 వద్ద కొనసాగుతోంది.
అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌పై అంచనాల నేపథ్యంలో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి.