ETV Bharat / business

కరోనా కేసులు, ప్యాకేజీలపై ఆశలే కీలకం - స్టాక్ మార్కెట్ వార్తలు

ఈ వారం స్టాక్ మార్కెట్లను కరోనా కేసులు సహా అంతర్జాతీయ పరిణామాలు ముందుకు నడిపించే అవకాశముంది. ఆర్థిక రికవరీ భయాలు, వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మదుపరులు దృష్టి సారించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

stocks outlook
ఈ వారం స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Aug 16, 2020, 6:29 PM IST

స్టాక్ మార్కెట్లను కరోనా కేసులు, అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి.

గత వారం విడుదలైన కీలక ఆర్థిక గణాంకాలతో దేశ రికవరీ రేటు ఆశించిన స్థాయిలో లేదని స్పష్టమైంది. ఇలాంటి సమయాల్లో మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఈ మిశ్రమ సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఒకవేళ అంచనాలకు తగ్గట్లే.. ప్రభుత్వం ప్యాకేజీపై ప్రకటన చేస్తే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని జియోజిత్​ ఫినాన్సియల్ సర్వీసెస్​ రీసెర్చ్ అధిపతి వినోద్​ నాయర్ తెలిపారు.

కరోనా కేసులు దేశీయంగా 26 లక్షలకు చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2.15 కోట్లు దాటాయి. ఈ లెక్కలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేయొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.

ఈ వారం డజన్​కుపైగా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం కూడా మార్కెట్లపై పడనుంది.

అంతర్జాతీయంగా చూస్తే అమెరికా కూడా మరో ఉద్దీపన ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. వీటతో పాటు చైనాతో నెలకొన్న అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపించొచ్చని అంటున్నారు నిపుణులు.

వీటన్నింటితో పాటు.. రూపాయి, ముడి చమురు ధరల కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:టెలిగ్రామ్​లో వీడియో కాల్​ సహా అదిరే కొత్త ఫీచర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.