కరోనా వైరస్ వ్యాధిని (కొవిడ్-19) అదుపు చేయడానికి పలు రకాల ఔషధాలను ప్రయోగించి చూస్తున్నారు. 'నిక్లోసమైడ్' అనే నూతన ఫార్ములేషన్‌పై మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రయోగాలు చేపట్టింది. ఈ ఔషధంపై మొదటి దశ (ఫేజ్-1) క్లినికల్ పరీక్షలు చేపట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీ అయిన దేవూంగ్ ఫార్మాసూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రాథమిక (ప్రీ-క్లినికల్) పరీక్షల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు సాధించినట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా పేర్కొంది. మనదేశంలో దీనిపై మొదటి దశ క్లినికల్ పరీక్షలు చేపట్టడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించినట్లు మ్యాన్‌కౌండ్ ఫార్మా సీఓఓ అర్జున్ జునేజా అన్నారు.
ఇదీ చూడండి: 'కారు'మేఘాలు తొలగుతున్నాయ్