కరోనా కారణంగా అమల్లో ఉన్న లాక్డౌన్... ప్రజల షాపింగ్ ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ అనంతరం అధిక శాతం వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపుతారని ఆ అధ్యయనంలో తేలింది. రాబోయే 6 నుంచి 9 నెలల్లో 46 నుంచి 64శాతం ఆన్లైన్ షాపింగ్ వినియోగదారులు పెరుగుతారని ఆ సర్వే ద్వారా తెలిసింది.
లాక్డౌన్ తర్వాత అంతే..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజలంతా ఒక్కసారిగా ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం ఇదే ధోరణి కొనసాగుతుందని కాప్జెమిని అనే ఐటీ సంస్థ ఓ నివేదిక ప్రచురించింది. ఏప్రిల్ నెల తొలి రెండు వారాల్లో ఆ సంస్థ చేసిన సర్వే చేసినట్లు తెలిపింది.
సర్వేలోని ముఖ్యాంశాలు..
- మహమ్మారి దేశంలోకి ప్రవేశించక ముందు 59 శాతం ప్రజలు చిల్లర వ్యాపారుల నుంచి కొనుగోళ్లు చేసేవారు. అయితే ఇప్పుడు అది 46 శాతానికి పడిపోయింది.
- కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత 78శాతం మంది ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
- ఆన్లైన్లో షాపింగ్‌లో అవసరమైనప్పుడు వస్తువులను ఆర్డర్ చేసుకొనే సౌకర్యం కారణంగా 74శాతం మొగ్గు చూపనున్నారు.
- 89 శాతం మంది ఆరోగ్య భద్రత, పరిశుభ్రతపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు.
- 65 శాతం ప్రజలు రాబోయే 6-9నెలల కాలంలో కిరాణా, ఇంటికి కావాల్సిన సరకులను ఆన్లైన్లో కొనడాన్ని పెంచనున్నారు.
- రాబోయే 6 నెలల్లో సంక్షోభం నుంచి కోలుకుంటామని 75 శాతం భారతీయ వినియోగదారులు ఆశాజనకంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సగటు 48శాతంగా ఉంది.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడితే క్యాష్‌బ్యాక్!