ETV Bharat / business

'నౌక, విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాను అమ్మబోం' - కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు

ఇటీవల బడ్జెట్​లో ప్రవేశపెట్టిన విధంగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ విధానంలో ఆయా సంస్థలను వ్యూహాత్మక, వ్యూహత్మకం కానీ రంగాలుగా వర్గీకరించిది. ఇందుకు సంబంధించిన విధివిధానలను ప్రభుత్వం విడుదల చేసింది.

Major port trusts, AAI out of the scope of PSE strategic divestment policy
ప్రధాన నౌక, విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటా విక్రయాలు ఉండవు
author img

By

Published : Feb 8, 2021, 8:16 AM IST

Updated : Feb 8, 2021, 8:26 AM IST

పెట్టుబడుల ఉపసంహరణ నిమిత్తం రూపొందించిన నూతన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్​ఈ) విధానంలో కేంద్రం పలు మార్పులు చేసింది. ప్రధాన పోర్టు ట్రస్టులు, ఎయిర్​ పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ), భద్రతా పరమైన ప్రింటింగ్​, నగదు ముద్రణ నిర్వహించే సంస్థలను వ్యూహాత్మకం, వ్యూహత్మకం కాని రంగాలుగా వర్గీకరించింది. వాటా విక్రయాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్​ఈలు), ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలకు పరిమితం చేసింది. లాభాపేక్ష రహిత కంపెనీలు, బలహీన వర్గాలకు తోడ్పాటు ఇస్తున్న సీపీఎస్​ఈలు, అభివృద్ధిలో భాగమైన కొన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలకు నూతన పీఎస్​ఈ విధానం వర్తించదు. గతవారం బడ్జెట్​లో పెట్టుబడులు ఉపసంహరణ/వ్యూహాత్మక వాటా విక్రయం విధాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో ఏముందంటే..

మొత్తం రంగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా విభజించారు. ఇందులో ప్రభుత్వం అట్టి పెట్టుకోనున్న ప్రభుత్వం రంగ సంస్థలను బాగా కుదించారు. మిగిలిన వాటిని ప్రైవేటీకరణ చేయడం లేదా విలీనం, మరో ప్రభుత్వం సంస్థకు అనుబంధ సంస్థగా మార్చడం లేదా మూసివేయడం చేయనున్నారు. నాలుగు రంగాలుగా అణుశక్తి, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్​,పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్​, బీమా, ఆర్థిక సేవలను వ్యూహత్మకం కాని వాటిగా చేశారు. సీపీఎస్​ఈలను ప్రైవేటీకరించడం లేదా మూసివేతకు పరిశీలించనున్నారు. రైల్వే, తపాలా, వంటి ప్రభుత్వ రంగాలకు నూతన పీఎస్​ఈ విధానం వర్తించదు.

'బ్యాంకుల ప్రవేటీకరణకు ఆర్బీఐతో కలసి పనిచేస్తాం'​

బడ్జెట్​లో ప్రతిపాదించిన మేర 2 బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం రిజర్వ్​బ్యాంక్​(ఆర్బీఐ)తో కలిసి పని చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా కోసం బ్యాంక్​ ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏమీ లేదన్నారు. నిరర్ధక ఆస్తుల(ఎన్​పీఏ) కోసం బ్యాండ్​ బ్యాంక్​ ప్రతిపాదనపై స్పందిస్తూ, నేషనల్​ అసెట్​ రికన్​స్ట్రక్షన్​ కంపెనీకి ప్రభుత్వం కొంత గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పీఎస్​యూల ప్రైవేటీకరణపై నిర్మల కీలక వ్యాఖ్యలు

Last Updated : Feb 8, 2021, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.