వాహన ప్రియులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎక్స్‌యూవీ700 మోడల్ని మహీంద్రా ఆవిష్కరిచింది. ఈ సిరీస్‌లోని గత మోడళ్లతో పోలిస్తే అద్భుత ఫీచర్లతో అభిమానులను అలరిస్తోంది.
ఎక్స్‌యూవీ 700 ఫీచర్లు, ప్రత్యేకతలు..
- కంపెనీ సరికొత్త లోగోతో వస్తున్న తొలి మోడల్ ఇదే. మహీంద్రా విడుదల చేయబోయే అన్ని భవిష్యత్ ఎస్‌యూవీలపై ఈ కొత్త లోగో కనిపిస్తుంది.
- ఇంటీరియర్‌లో సరికొత్త అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన రెండు 10.25 అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మన దేశంలో లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా సాంకేతికతను చూడవచ్చు.
- జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
- డ్రైవర్ నిద్ర మత్తులో ఉంటే అప్రమత్తం చేసేలా 'డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం'తో కూడిన లెవల్ 1 ఆటానమస్ సిస్టం వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను అందిస్తున్నారు.
- ఇంటీరియర్‌లో బ్లాక్, బేజ్ రంగులతో కూడిన డ్యూయల్ టోన్ థీమ్ డాష్‌బోర్డ్, లెదర్ సీట్లు, డోర్ ప్యాడ్‌లపై లెథర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను కూడా అమర్చారు.
- క్యాబిన్ లోపల సెంటర్ ఎయిర్ కండిషన్ వెంట్‌లను ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద ఏర్పాటు చేశారు. దీనికి క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఫలితంగా ఇవి క్యాబిన్‌కు మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తున్నాయి.
- 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగలిగే ఫిల్టరింగ్ వ్యవస్థను పొందుపరిచారు.
- అతివేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ హెచ్చరికలు వినిపిస్తాయి.
- మహీంద్రా ఎక్స్‌యూవీ700లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, నాలుగు సౌండ్ మోడ్‌లతో కూడిన సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్‌లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- ఇంజన్ విషయానికి వస్తే, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700ని పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లతో ఇస్తున్నారు. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.
- ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.
- హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి ఎస్‌యూవీలతో ఎక్స్‌యూవీ700 పోటీ పడనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎక్స్ షోరూమ్ ధర రూ.11.9 లక్షలుగా నిర్ణయించింది మహీంద్రా.
మహీంద్రా ప్రూవింగ్ ట్రాక్..
తమిళనాడులోని కాంచీపురంలో ఎస్‌యూవీలను పరీక్షించేందుకు వినియోగించే భారీ ట్రాక్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా నేడు ప్రారంభించింది. మొత్తం 454 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ దీన్ని రూపొందించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.510 కోట్లు. 'మహీంద్రా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రూవింగ్ ట్రాక్'గా దీన్ని పిలుస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో, వివిధ పరిస్థితుల్లో మహీంద్రా కార్లు ఎలా నడవనున్నాయో ఇక్కడ పరీక్షించనున్నారు.
భారత్‌లో ఉన్న అతిపెద్ద ప్రూవింగ్ ట్రాక్ ఇదేనని మహీంద్రా తెలిపింది. ఈ ట్రాక్‌లో కొంత భాగాన్ని 2022 ద్వితీయార్థం నుంచి వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇవీ చదవండి: