ETV Bharat / business

ఆర్థిక గణాంకాలే ఈ వారం మార్కెట్లకు కీలకం

ఈ వారం స్టాక్ మార్కెట్లను స్థూల ఆర్థిక గణాంకాలు ముందుకు నడిపించనున్నాయి. వీటికి తోడు కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, కరోనా సంబంధిత వార్తలపై మదుపరులు దృష్టి సారించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

stocks outlook
స్టాక్ మార్కెట్ అంచనాలు
author img

By

Published : May 10, 2020, 7:09 PM IST

స్టాక్ మార్కెట్లను ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు ముందుకు నడిపించనున్నాయి. కరోనా సంబంధిత వార్తలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఈ వారంలోనే పారిశ్రమికోత్పత్తి, రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణంకాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలు మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలుగా చెబుతున్నారు నిపుణులు.

మరో వైపు అంతర్జాతీయంగా అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని మోతీలాల్​ ఓస్వాల్ ఫైనాన్షియల్​ సర్వీసెస్ సిద్దార్థ కింకా అన్నారు.

దేశీయంగా కరోనా కేసులల్లో వృద్ధి, నిరాశాజనకంగా సాగుతున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేసే అంశాలని రెలిగేర్ బ్రోకరేజీ సంస్థ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఈ వారంలో దిగ్గజ సంస్థలు కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, బంధన్ బ్యాంక్, మారుతీ సుజుకీలు 2019-20 నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.

ముడిచమురు ధరలు, రూపాయి ఒడుదొడకులు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో రేపు నిర్మల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.