ETV Bharat / business

ఎక్స్​యూవీ 700​లో లగ్జరీ వేరియంట్స్​- ధర ఎంతంటే? - మహీంద్రా ఏఎక్స్​7 లగ్జరీ ఏటీ ఫీచర్లు

దేశీయ మార్కెట్లోకి ఎక్స్​యూవీ 700 మోడల్​లో మరో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది మహీంద్రా & మహీంద్రా. డీజిల్ ఇంజిన్​తో అందుబాటులోకి వచ్చిన ఈ రెండు లగ్జరీ వేరియంట్ల ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

New model of XUV 700
ఎక్స్​యూవీ 700 కొత్త మోడల్​
author img

By

Published : Oct 5, 2021, 5:36 PM IST

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా & మహీంద్రా(ఎం&ఎం).. ఎక్స్​యూవీ 700 మోడల్​లో మరో రెండు కొత్త వేరియంట్లను మంగళవారం ఆవిష్కరించింది. ఏఎక్స్7 పేరుతో.. ఒక వేరియంట్​ను ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​తో, మరో వేరియంట్​ను మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు డీజిల్​ ఇంజిన్​తో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది కంపెనీ. రెండూ 7 సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది.

ఏఎక్స్​7 లగ్జరీ ఎంటీ వేరియంట్​ ధరను (ముంబయి ఎక్స్​షోరూం) రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. ఏఎక్స్​7 లగ్జరీ ఏటీ+ ఏడబ్ల్యూడీ వేరియంట్​ ధరను రూ.22.89 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరలు మొదటి 25 వేల బుకింగ్స్​కు మాత్రమే వర్తిస్తాయని ఎం & ఎం వెల్లడించింది. బుకింగ్స్ అక్టోబర్​ 7న ప్రారంభమవుతాయని తెలిపింది.

ఎం & ఎం ఇంతకుముందే.. ఎక్స్​యూవీ 700 సిరీస్​లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఎంఎక్స్​, ఏఎక్స్​ పేర్లతో విడుదలైన వీటి ప్రారంభ ధరను రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.

XUV 700 look
ఎక్స్​యూవీ 700 లుక్​

ఏఎక్స్​7 లగ్జరీ వేరియంట్​ విశేషాలు..

ఇది వరకు విడుదలైన ఏఎక్స్​7కు అదనంగా పలు ఫీచర్లను ఏఎక్స్​7 లగ్జరీ వేరియంట్లో పొందుపరిచింది కంపెనీ. 3డీ సౌండ్​, స్మార్ట్​ డోర్​ హ్యాండిల్స్​, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ, ఎలక్ట్రిక్ పార్క్​ బ్రేక్​, కీలెస్ ఎంట్రీ, వైర్​లెస్​ ఛార్జింగ్ సహా పలు ఇతర సదుపాయాలు ఇందులో ఉన్నట్లు తెలిపింది ఎం & ఎం.

దీనితో పాటు కంపెనీ వెబ్​సైట్​లో ఎక్స్​యూవీ 700 కార్ల కోసం.. యాడ్​ టూ కార్ట్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. అటోమొబైల్ కంపెనీల వెబ్​సైట్​లో ఇలాంటి ఫీచర్ తీసుకొచ్చిన తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. దీని ద్వారా.. ఇంజిన్​ టైప్​, కలర్​, సీటింగ్ కెపాసిటీ, కాన్ఫిగరేషన్​ వంటివాటిని కస్టమైజ్​ చేసుకునే వీలు కలగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.