ETV Bharat / business

'భారత్​ గ్యాస్' వినియోగదారులకు ​సబ్సిడీ రాదా?

బీపీసీఎల్​ వినియోగదారులు వంట గ్యాస్​ సబ్సిడీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ చెప్పారు. ఆ సంస్థను ప్రైవేటీకరించిన తర్వాత కూడా వినియోగదారుల రాయితీ నగదును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని స్పష్టం చేస్తారు.

LPG subsidy for BPCL consumers to continue post-privatisation: Pradhan
'వంటగ్యాస్ సబ్సీడీపై వారు ఆందోళన చెందొద్దు'
author img

By

Published : Nov 27, 2020, 4:14 PM IST

Updated : Nov 27, 2020, 8:39 PM IST

వంట గ్యాస్​ రాయితీపై భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​(బీపీసీఎల్​) వినియోగదారులెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ స్పష్టం చేశారు. వినియోగదారుల రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు. సంస్థను ప్రైవేటీకరించినా ఈ విధానంలో మార్పు ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీకి గ్యాస్​ సంస్థ యాజమాన్యంతో సంబంధం లేదని వివరించారు.

2020-21 ఏడాదికి గాను పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా బీపీసీఎల్​లోని 53 శాతం వాటాను విక్రయిస్తోంది కేంద్రం. నిర్వహణా బాధ్యతలను కూడా ప్రైవేటు యాజమాన్యానికే అప్పజెప్తోంది.

అయితే దీని ద్వారా భారత్​ గ్యాస్​ వినియోగదారులు సబ్సిడీ కొల్పోతారేమోనని సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టత ఇచ్చారు.

భారత్​లో మొత్తం 28.5 కోట్ల మంది ఎల్​పీజీ వినియోగదారులున్నారు. వీరిలో 7.3 కోట్ల మంది భారత్​ గ్యాస్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఏటా 12 సిలిండర్లకు రాయితీ కల్పిస్తోంది కేంద్రం.

ఇదీ చూడండి: ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

Last Updated : Nov 27, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.