పెట్రోల్, నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరపై రూ. 25 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రకటించింది.
ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.694గా ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.719కు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది చమురు సంస్థ.
ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు