ETV Bharat / business

ఇకపై నచ్చిన డీలర్​ వద్దే వంట గ్యాస్ రీఫిల్​ - ఎల్​పీజీ బుకింగ్​

ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్ అందుబాటులో ఉంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.​ వినియోగదారులు తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రీఫిల్​ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. డిస్ట్రిబ్యూషన్​​ కేంద్రానికి వెళ్లకుండా ఆన్​లైన్​లోనే ఈ సేవలు పొందవచ్చు.

lpg portability
వంట గ్యాస్
author img

By

Published : Jun 10, 2021, 9:17 PM IST

వంట గ్యాస్​ వినియోగదారులు తమకు నచ్చిన డీలర్​ వద్ద రీఫిల్​ చేయించుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఈ మేరకు పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్​ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంబంధిత ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీ(ఓఎంసీ) జాబితా ప్రకారం తమ ప్రాంతంలో ఉన్న పంపిణీదారుల వద్ద గ్యాస్​ రీఫిల్​ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్​ కేంద్రానికి వెళ్లకుండానే మొబైల్​ యాప్​ ద్వారా ఆన్​లైన్​లో పోర్టబులిటీ చేసుకోవచ్చని తెలిపింది.

అయితే అదే సంస్థకు చెందిన వేరే పంపిణీదారుడికి(డీలర్​) మార్చుకోవడానికే వినియోగదారులకు వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిని ఫైలట్​ ప్రాజెక్టు కింద చండీగఢ్​​​, కోయంబత్తూర్​, గురుగ్రామ్, పుణె, రాంచీలలో ​ప్రారంభించనున్నారు.

ఈ సేవ ఎలా పొందాలంటే..?

ఫోన్​లోని యాప్​/లాగిన్​ ద్వారా ఎల్​పీజీని బుక్​ చేసినప్పుడు.. వినియోగదారులకు తమ ప్రాంతానికి చెందిన పంపిణీదారుల జాబితా కనిపిస్తుంది. ఆ పక్కనే వాటి రేటింగ్ కూడా ఉంటుంది. వాటి ఆధారంగా తమకు నచ్చిన పంపిణీదారులను ఎంపిక​ చేసుకోవచ్చు.

అయితే ముందున్న పంపిణీదారుడు​.. వినియోగదారులను సంప్రదించి ఒప్పించే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు నమ్మకం ఉంటే.. పోర్టబిలిటీ అభ్యర్థనను 3 రోజుల వ్యవధిలో ఉపసంహరించుకోవచ్చు. లేకపోతే.. వినియోగాదారుడు ఎంచుకున్న పంపిణీదారుకు కనెక్షన్​ బదిలీ అవుతుంది. ఈ సౌకర్యం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదీ చూడండి: జీఎస్​టీ తగ్గింపుపై 12న కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.