ETV Bharat / business

'దేశంలో పెరుగుతున్న ఎల్​పీజీ వినియోగం​' - december 2020 to febrauary 2021 lpg usage in india

దేశంలో వంట గ్యాస్​ వినియోగం పెరుగుతోందని ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల్లో డిసెంబర్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య ఈ వినియోగం 23.2 శాతం మేర పెరిగిందని వివరించింది.

LPG consumption in india
'దేశంలో ఎల్​పీజీ వినియోగం ఫుల్​ జోష్​'
author img

By

Published : Mar 11, 2021, 10:22 AM IST

రోజురోజుకూ వంట గ్యాస్ ధరతో పాటే వినియోగం కూడా పెరిగిపోతోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌(ఐఓసీ​) పేర్కొంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) లబ్ధిదారుల్లో డిసెంబర్ ‌2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య ఈ వినియోగం 23.2 శాతం మేర పెరిగిందని ఐఓసీ వివరించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు.. ఏటా 3 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతాయి.

ఐఓసీ ఏం చెప్పిందంటే..

  • మొత్తం వినియోగదారుల్లో ఈ మూడు నెలల వ్యవధిలో.. 7.3 శాతం మేర వినియోగం పెరిగింది.
  • పీఎంయూవై లబ్ధిదారుల్లో.. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21లో 19.5 శాతం మేర పెరిగింది.
  • ఫిబ్రవరి 2021 వరకూ చూస్తే.. గతేడాదితో పోలిస్తే తరువాతి సంవత్సరంలో దాదాపు 10.3 శాతం మేర ఎల్​పీజీ వినియోగం పెరిగింది.
  • అంతే కాకుండా ఎల్​పీజీ వాడకం 2014లో 55 శాతంగా ఉంటే ప్రస్తుతం అది 99 శాతంగా ఉంది.

ప్రతి ఒక్కరికీ ఎల్‌పీజీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పీఎంయూవై పథకం కింద కేంద్రం రూ. 12,800 కోట్ల వ్యయంతో 8 వేల కుటుంబాలకు ఎల్​పీజీ కనెక్షన్లు ఇచ్చింది.

ఇదీ చూడండి:చమురు మంట.. ఆరేదెట్టా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.