ETV Bharat / business

గూగుల్​ ఉండగా 'ఫోన్'​ పోయిందని దిగులేల?

మీరు ఫోన్​ పోగొట్టుకున్నారా? అందులో మీ వ్యక్తిగత, సున్నితమైన విషయాలు ఉన్నాయా? దిగులు పడకండి. గూగుల్ మీకు సాయపడుతుంది. అందుకోసం ఇలా చేసి చూడండి.

గూగుల్​ ఉండగా 'ఫోన్'​ పోయిందని దిగులేల?
author img

By

Published : Aug 4, 2019, 12:52 PM IST

ఈ రోజుల్లో ఫోన్​ పోవడం అంటే ఒక పరికరాన్ని కోల్పోవడం మాత్రమే కాదు. ఎందుకంటే అందులో మన వ్యక్తిగత చిత్రాలు, ఈ-మెయిల్స్, మెసేజ్​లు సహా సున్నితమైన సమాచారం ఉంటుంది. వీటన్నింటిని ఒక్కసారిగా కోల్పోవడం మనల్ని తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది కదా! మరేం ఫర్వాలేదు. గూగుల్ తల్లి మీకు సాయపడుతుంది. అది ఎలా అంటారా?

గూగుల్​... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మీ ఫోన్​ను కనుగొనడం చాలా సులభం. ఇందుకోసం... మీ అన్ని గూగుల్ ఖాతాల్లోనూ జీపీఎస్​ను టర్న్​ఆన్​​ చేసి ఉండాలి. అలాగే వర్కింగ్ డేటా కనెక్షన్​ను కలిగి ఉండాలి. అంతే... మీరు డెస్క్​టాప్​ లేదా మొబైల్​ ఫోన్​ ఉపయోగించి పోగొట్టుకున్న మీ ఫోన్​ను ఎక్కడ ఉన్నా సరే సులభంగా కనుగొనవచ్చు.

డెస్క్​టాప్ ఉపయోగించి...

1. మీ జీ-మెయిల్​ ఖాతాలోకి సైన్​ ఇన్​ చేయండి. తరువాత హోం పేజీకి వెళ్లండి. కుడివైపు ఎగువన ఉన్న ప్రొఫైల్​ ఆప్షన్​ను ఎంచుకోండి.

2. గూగుల్​ ఖాతాను క్లిక్​ చేసి, ఎడమ వైపున ఉన్న 'భద్రత'(సెక్యూరిటీ)ని ఎంచుకోండి. అక్కడ 'మీ పరికరాలు' (యువర్​ డివైసెస్​) కింద 'పోగొట్టుకున్న/చోరీకి గురైన ఫోన్​ కనుగొనండి'పై నొక్కండి.

3. మీరు వెతుకుతున్న పరికరాన్ని (డివైస్​)ను ఎంచుకోండి.

4. మీ జీ-మెయిల్ పాస్​వర్డ్​ను నమోదు చేసి, మీ గుర్తింపును ధ్రువీకరించుకోండి.

మొబైల్ ఉపయోగించి...

1. ఫోన్​లోని గూగుల్​ యాప్​ తెరచి, 'మేనేజ్​ యువర్​ గూగుల్​ అకౌంట్'ను క్లిక్​ చేయండి.

2. మీ ఖాతా పైభాగంలోకి వెళ్లి 'భద్రత' (సెక్యూరిటీ)ని నొక్కండి.

3. 'మీ పరికరాలు' (యువర్​ డివైసెస్​) కింద 'పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్​ కనుగొనండి'ని ఎంచుకోండి.

4. మీరు వెతుకున్న పరికరాన్ని (డివైస్​)ని ఎంచుకోండి. మీ జీ-మెయిల్ పాస్​వర్డ్ నమోదు చేసి మీ గుర్తింపును ధ్రువీకరించుకోండి.

మీరు మీ పాస్​వర్డ్​ను నమోదు చేసిన తరువాత, మీరు 'పోగొట్టుకున్న ఫోన్'​ ఉన్న ప్రాంతాన్ని అనుసరించి ఐకాన్ బూడిద రంగులోకి మారుతుంది. ఫోన్ 'కరంట్​ లొకేషన్​'లో ఉన్నప్పుడు ఐకాన్​ ఆకుపచ్చగా కనిపిస్తుంది. అది మళ్లీ స్థానం మారితే ఐకాన్​ బూడిద రంగులోకి మారుతుంది. ఐకాన్ ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు దానిపై ట్యాప్​ చేస్తే, అది మిమ్మల్ని గూగుల్ మ్యాప్స్​కు నిర్దేశిస్తుంది. అది మీ ఫోన్​ను కనుగొనడానికి దారిచూపిస్తుంది.

మీరు పోగొట్టుకున్న మొబైల్ మీకు దగ్గరగా ఉంటే...'ప్లే సౌండ్​ పోస్ట్'​ను క్లిక్​ చేయండి. అది మీ ఫోన్​ సైలెంట్​ మోడ్​లో ఉన్నాసరే 5 నిమిషాలపాటు బయటకు రింగ్ వినిపించేలా చేస్తుంది. ఇలా మీరు పోగొట్టుకున్న ఫోన్​ను సులభంగా పొందండి.

ఇదీ చూడండి: స్నేహం... అక్షరాలకందని అనుభూతుల జీవన ప్రయాణం...

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 4 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0037: US TX Shooting Police Mandatory Courtesy KVIA/No access El Paso market/ No access by US broadcast networks/No re-sale, re-use or archive 4223522
Police: Hate crime considered in Texas shooting
AP-APTN-0011: US Shooting ORourke Mandatory courtesy KTNV/No access Las Vegas market, No use by US broadcast networks, No re-sale, reuse or archive 4223520
O'Rourke: distraught by mass shooting in El Paso
AP-APTN-0008: US TX Shooting Governor Mandatory Courtesy KVIA/No access El Paso market/ No access by US broadcast networks/No re-sale, re-use or archive 4223521
Texas governor: 20 dead in El Paso mall shooting
AP-APTN-2336: Australia US Pompeo 2 AP Clients Only 4223519
Pompeo meets Australian FM and defence ministers
AP-APTN-2327: US TX Mall Shooting Doctors Mandatory Courtesy KVIA/No access El Paso market/ No access by US broadcast networks/No re-sale, re-use or archive 4223518
Del Sol medical centre update on shooting victims
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.