ETV Bharat / business

లాభాల స్వీకరణతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు గురువారం బ్రేక్ పడింది. ఇటీవల లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల సెన్సెక్స్ 149 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 41 పాయింట్లు తగ్గింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఇండస్​ఇండ్ బ్యాంక్ అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది.

STOCKS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Oct 22, 2020, 3:49 PM IST

వరుసగా లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ల జోరుకు గురువారం అడ్డుకట్టపడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 149 పాయింట్లు కోల్పోయి.. 40,558 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,896 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, హెవీ వెయిట్​, బ్యాంకింగ్ షేర్లలో నమోదైన లాభాల స్వీకరణ ప్రభావం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 40,721 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,309 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,939 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,853 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్​, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్ సూచీలు నష్టపోయాయి. హాంకాంగ్ సూచీ లాభాలను గడించింది.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం స్వల్పంగా 4 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.54 వద్ద స్థిరపడింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.46 శాతం పడిపోయింది. బ్యారెల్ ముడి చమురు ధర 41.92 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:కరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.