ETV Bharat / business

ఉల్లి నేర్పే పాఠాలతో ధరలకు కళ్ళెం - editorial news

ఈ మధ్యకాలంలో ఉల్లి చేసిన లొల్లి దేశంలో ఎవ్వరూ ఎప్పటికీ మరచిపోలేరు. మళ్లీ ఎప్పుడు అధిక ధరలతో ఎగసిపడుతుందా అని బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఉల్లి ధరలు పెరుగుతున్నా లాభపడుతోంది మాత్రం అక్రమ నిల్వదారులు. మరో వైపు ఉల్లి గోల రాజకీయ నాయకుల చుట్టూ కూడా తిరుగుతుంటుంది. ఇంతకీ మనకు ఉల్లి నేర్పే పాఠాలేంటో తెలుసుకుందామా?

Look for prices with onion teaching lessons
ఉల్లి నేర్పే పాఠాలతో ధరలకు కళ్ళెం
author img

By

Published : Jan 21, 2020, 6:44 AM IST

Updated : Feb 17, 2020, 8:00 PM IST

చాలాకాలం తరవాత నేడు దేశంలో ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతోంది. దీనికి పలు కారణాలు ఉన్నా, వాటిలో ఉల్లిపాయల ధరల పెరుగుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గుముఖంలో ఉన్నా, అవి మళ్లీ ఎప్పుడు భగ్గుమంటాయో చెప్పలేం. ఉల్లి ధరలు పదేపదే చుక్కలను తాకడానికి కారణాలను, శాశ్వత పరిష్కారాలను కనుగొనేంతవరకు అవి జనం జేబుకు చిల్లు పెడుతూనే ఉంటాయి. ఉల్లిపాయలకు కొరత ఏర్పడి ధరలు మండినప్పుడు ఉల్లి ఎగుమతులను నిషేధించి, హడావుడిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, సమస్య ఉపశమించగానే, దానిగురించి విస్మరించడం మన ప్రభుత్వానికి అలవాటైపోయింది. అసలు ఉల్లి ధరలు పెరిగినా తరిగినా రైతుకు లాభం ఉండటం లేదు. పేదలకు ఆహారంలో ఉల్లిపాయల వాడకాన్ని మానేయడం వినా గత్యంతరం లేదు. ఏతావతా ఉల్లి ధరల పెరుగుదల వల్ల లాభపడుతున్నది అక్రమ నిల్వదారులు, నల్లబజారు వర్తకులు మాత్రమే.

జనానికి మేలు, పార్టీలకు కీడు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. కానీ, ఎన్నికల్లో ఉల్లి చేసే కీడు అంతా ఇంతా కాదని రాజకీయ నాయకులకు తరచూ అనుభవమవుతోంది. 1978లో ఉల్లి ధరలు నింగిని అంటినప్పుడు, దాన్ని ఎన్నికల సమస్యగా మలచుకోవడం ద్వారా ఇందిరా కాంగ్రెస్‌ 1980లో అధికారంలోకి రాగలిగింది. 1977లో ఘోర పరాజయం పొందిన ఇందిరా గాంధీ మూడేళ్లలోనే మళ్లీ అధికారం చేపట్టగలిగారంటే అది ఉల్లి మహిమే. తరవాత 1998లో ఉల్లి ధరలు పెరిగి దిల్లీ, రాజస్థాన్‌లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలకు ఎసరు తెచ్చాయి. 2010, 2013 సంవత్సరాల్లో పెరిగిన ఉల్లి ధరలు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి కష్టాలు తెచ్చిపెట్టాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడైతే అదుపు తప్పుతాయో అప్పుడు ప్రభుత్వాలకు చేటు కాలం దాపురిస్తుంది. రోజువారీ సరకుల ధరలను కట్టడి చేయలేకపోవడాన్ని ప్రభుత్వ అసమర్థతగా ప్రజలు భావించి, ఎన్నికల్లో శిక్షిస్తారు. దీని ముందు భావోద్వేగ పూరిత నినాదాలు, విధానాలూ దిగదుడుపే అవుతాయి. పారిశ్రామికోత్పత్తి హెచ్చు తగ్గులు, ఎగుమతులు దిగుమతులు, నిరుద్యోగ రేటు, ద్రవ్య విధానం, పెట్టుబడుల కొరత, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక సూత్రీకరణలు, విశ్లేషణలు, ముందస్తు అంచనాలు సామాన్య జనులకు పట్టవు.

ఈ సూచికల తాకిడికి వాస్తవంగా గురైనప్పుడే ప్రజలు స్పందిస్తారు. దైనందిన జీవిత సమస్యలే వారి ఓటింగ్‌ తీరును శాసిస్తాయి. పాలక పార్టీలకు చేటు తెస్తాయి. ఉల్లి ధరల పెరుగుదల అటువంటి దైనందిన సమస్య. ఇటీవల కొన్ని నగరాల్లో ఉల్లి ధర కిలోకు రూ.200 వరకు పలికింది. విదేశాల నుంచి భారీగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్న తరవాత నుంచి ధర కిందకు దిగిరావడం మొదలుపెట్టినా, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటం ద్వారానే పాలకులు తమ సామర్థ్యం చాటుకోగలుగుతారు.

ఈ ఏడాది అకాల వర్షాల వల్ల ఉల్లి పంట నష్టమైందనీ, మార్కెట్‌ లోటుపాట్లు కూడా దీనికి జత అయ్యాయని వివరణలు ఇస్తూ, ప్రభుత్వం ఇదేదో తాత్కాలిక సమస్య అని నచ్చచెప్పాలని చూసింది. అంతేతప్ప శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కనుగొనాలనే స్పృహ దానికి లోపించింది. జీడీపీ వృద్ధి మందగిస్తూ, రిటైల్‌ మార్కెట్‌ ద్రవ్యోల్బణం గత అయిదేళ్లలో ఎన్నడూ లేనంతగా 7.35 శాతానికి, ఆహార ధరలు 14.12 శాతానికీ పెరిగి, ఉల్లి, ఇతర కూరగాయల ధరలు ఆహార ద్రవ్యోల్బణంలో 60.5 శాతానికి కారణమవడం వల్ల జన జీవితాలకు సెగ తగులుతోంది. ఏటా ఉల్లి ధరలను స్థిరంగా ఉంచడం అసాధ్యమేమీ కాదు.
భారతదేశంలో ఉల్లి ఉత్పత్తి తక్కువా అంటే అదేమీ కాదు. బహుశా దేశ అవసరాలకన్నా ఉత్పత్తి కాస్త తక్కువగా ఉండొచ్చు కానీ, అది ఉల్లి గిరాకీ కన్నా తక్కువగా ఏమీ లేదు. వ్యాపారం గురించి పట్టించుకోవడం తమ పని కాదని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అది పొరపాటు. ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు గిరాకీ గురించి పట్టించుకొంటారు తప్ప ప్రజల వాస్తవ అవసరాలను కాదు. వారి అవసరాలు తీరాలంటే తగిన కొనుగోలు శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే వస్తువులు కొనలేరు. ఫలితంగా మార్కెట్‌లో గిరాకీ పెరగదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ‘పేదలు ఉల్లిగడ్డలను కొనలేరు కదా’ అని 1998లో నాటి దిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ వ్యాఖ్యానించారు. దాని ఫలితంగా పదవి పోగొట్టుకున్నారు.

అన్ని వర్గాల గిరాకీకి సరిపడా ఏటా కోటిన్నర టన్నుల ఉల్లి గడ్డలు కావాలి. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న ఉల్లిపాయలు 2.3 కోట్ల టన్నులకు పైనే. 2012-13లో 1.68 కోట్ల టన్నుల పైచిలుకు ఉల్లి ఉత్పత్తి కాగా, 2018-19 వచ్చేసరికి అది 40 శాతం పెరిగి దాదాపు 2.35 కోట్ల టన్నులకు చేరింది. చైనా తరవాత ప్రపంచంలో అత్యధికంగా ఉల్లిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశమే. ప్రపంచ ఉల్లిగడ్డల ఉత్పత్తిలో భారత్‌ వాటా 19 శాతం. గిరాకీని మించి ఉల్లి ఉత్పత్తి అవుతున్నప్పుడు, మిగులు ఉత్పత్తిని ఎప్పటికప్పుడు నిల్వ చేసుకుంటే, ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి కొరత ఏర్పడినప్పుడు వెంటనే దాన్ని తీర్చగలుగుతాం. అలాంటి ముందు జాగ్రత్త లోపించినందునే ప్రస్తుతం ఉల్లి ధరలు మిన్నంటాయి.

నిల్వ పంపిణి యంత్రాంగమేదీ?

గత సంవత్సరం మార్చి తరవాత ఉల్లి ధరలు 400 శాతం పెరిగాయని కేంద్ర ఆహార, ప్రభుత్వ పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ పార్లమెంటుకు తెలిపారు. 2019-20లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి పంటకు నాట్లు వేయడం మూడు నాలుగు వారాలు ఆలస్యమైంది. పంట విస్తీర్ణం కూడా తగ్గింది. పంట కోత కాలంలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌లలో తెరిపిలేకుండా అకాల వర్షాలు కురిసి పొలాల్లో పంట దెబ్బతిన్నది. ఉల్లి కొరతకు ఇవే కారణాలని పాశ్వాన్‌ తెలియజేశారు. నేడు వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల్లో మార్పు వస్తోంది. దీన్ని నివారించడం ప్రభుత్వం చేతిలో లేని మాట నిజమే కానీ, తాను చేయగలిగిన పనులు చాలానే ఉన్నాయని మరచిపోకూడదు.

ఉల్లి గిరాకీని సరిగ్గా అంచనా వేసి, దాన్ని తీర్చడానికి నిల్వ-పంపిణీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి సమస్యను అధిగమించాలి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ వైఫల్యం ఒక్క ఉల్లి పంట విషయంలోనే కాదు, ఇతర పండ్లు, కూరగాయల విషయంలోనూ కనిపిస్తోంది. కొరత సమయాల్లో ధరలు ఎగబాకి, రైతుల ఆదాయాలు పెరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఇలాంటి సందర్భాల్లో లాభపడుతున్నది వ్యాపారులు, దళారులు మాత్రమే. మరోవైపు పంట దిగుబడి తగ్గడం వల్ల రైతులకు ఆదాయమూ తగ్గిపోతుంది. ప్రజలకు మాత్రం ధరలు పెరిగిపోతాయి.

మొదటిది- ప్రస్తుతం ఉల్లిగడ్డలకు దేశమంతటా గిరాకీ ఉండగా, ఉత్పత్తి మాత్రం కొన్ని రాష్ట్రాలకే పరిమితం. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌లలోనే 75 శాతం ఉల్లి పంట సాగవుతోంది. అందులోనూ ఒక్క మహారాష్ట్రే 30 శాతం ఉల్లిని సాగుచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలను కలుపుకొంటే కేవలం ఏడు రాష్ట్రాల్లోనే 80 శాతం ఉల్లి సాగవుతోంది. కాబట్టి, ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి సాగును చేపట్టడం అవసరం. ప్రస్తుతం ఉల్లి దిగుబడిలో 20 శాతాన్ని మాత్రమే సక్రమంగా నిల్వ చేయగలుగుతున్నారు. 30-40 శాతం పంట సరైన నిల్వ సౌకర్యాలు లేక పాడవుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం రెండో పరిష్కారం. పంట వల్ల వచ్చే లాభాల్లో అత్యధిక వాటాను అక్రమ నిల్వదారులు, దళారులే చేజిక్కించుకొంటున్నారు. వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతుల ఆదాయాలను పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం మూడో పరిష్కారం. ఒక్క ఉల్లిపాయలనే కాదు- పండ్లు, కూరగాయల ఉత్పత్తి, పంపిణీ, ఎగుమతులు, దిగుమతులకు పటిష్ఠ విధానాలను చేపట్టడం ద్వారా ప్రభుత్వం అందరి ప్రయోజనాలను కాపాడగలుగుతుంది.

అన్ని వర్గాలకు అవసరమే!

ఉల్లి సమస్య మీద లోక్‌సభలో రగడ రేగినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తమ కుటుంబానికి ఉల్లిపాయలు తినే అలవాటు లేదని చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబం లాంటివి దేశంలో చాలానే ఉన్నాయి. వందల ఏళ్ల నుంచి ఉల్లి, వెల్లుల్లి ముట్టని కుటుంబాలు, కులాలు దేశమంతటా ఉన్నాయి. ఉల్లి తామసిక ఆహారమని, దాన్ని తింటే బద్ధకం, మందకొడితనం కలుగుతాయని వారి నమ్మకం. జైన మతస్తులు కూడా ఇదే కారణంపై ఉల్లి, వెల్లుల్లితోపాటు కొన్ని రకాల దుంపలను కూడా దగ్గరకు రానివ్వరు. క్రీస్తు శకం ఏడో శతాబ్దిలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయెన్‌ త్సాంగ్‌ భారతీయులు ఉల్లిపాయలు తినరనీ, వాటిని తిన్నవారిని ఊరి నుంచి వెలివేస్తారని రాశారు. అలాగని ప్రాచీన కాలంలో అన్ని దేశాల్లో ఇలాంటివారు ఉండేవారని భావించనక్కర్లేదు.

చాలా దేశాల్లో ఉల్లిపాయలను అమూల్యమైనవిగా, పవిత్రమైనవిగా పరిగణించేవారు. ఉల్లి పొరలు వలయం లోపల వలయంగా ఉంటాయి కాబట్టి పురాతన ఈజిప్షియన్లు వాటిని ఆరాధ్యనీయంగా, అనంతత్వానికి చిహ్నాలుగా భావించేవారు. తమ ఫారోలు (చక్రవర్తులు) మరణించినప్పుడు వారి సమాధుల్లో ఉల్లిపాయలను ఉంచేవారు. ఫారోలు వాటిని తమ వెంట స్వర్గానికి తీసుకెళతారని నమ్మకం. మధ్య యుగాల్లో ఐరోపా దేశాల్లో పెళ్ళి కానుకలుగా ఉల్లిపాయలను ఇచ్చేవారు. రోజులు మారాయి. ఇప్పుడు ఉల్లిపాయలు తామసిక ఆహారమా, సాత్విక ఆహారమా, పవిత్రమైనవా లేక పనికిరానివా అనే తర్జనభర్జనలకు తావు లేదు.

డా.పీఎస్​ఎం రావు

(రచయిత- అభివృద్ధి వ్యవహారాల ఆర్థిక వేత్త)

Intro:Body:

https://www.aninews.in/news/entertainment/bollywood/saif-ali-khan-has-not-studied-indias-ancient-history-properly-says-ram-kadam20200120204918/

Conclusion:
Last Updated : Feb 17, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.