మరో విడత లాక్డౌన్ పొడిగింపుపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా విభిన్నంగా స్పందించారు. లాక్డౌన్ అనే పదానికే దూరంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
"లాక్డౌన్ అనేది పరిమిత కాలంపాటు మాత్రమే ఉండాలి. ఇప్పడు నాలుగో విడత లాక్డౌన్ ముగిస్తోంది. కనుక ఈ తరుణంలో 'అన్లాక్ 1.0' ప్రారంభించాల్సిన అవసరం ఉంది."
- ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్
ఆరోగ్య సంక్షోభం కూడా..
పదే పదే లాక్డౌన్ పొడిగింపు వల్ల ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీస్తుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా మానసిక రోగాలు ఉత్పన్నమవుతాయని, ఫలితంగా ఆరోగ్య సంక్షోభం కూడా తలెత్తే అవకాశముందని అన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం విధాన రూపకర్తలకు చాలా కష్టమైన పనేనని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అయితే లాక్డౌన్ పొడిగింపు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: లక్షణాలు లేకున్నా.. 28శాతం మందికి కరోనా