ETV Bharat / business

‘మార్కెట్‌ విలువ’లో పోటీపడుతున్న స్థానిక ఔషధ సంస్థలు - మదుపరులకు లాభాల పంట

స్థానిక ఫార్మా కంపెనీలు సంపద సృష్టిలో పోటీ పడుతున్నాయి. మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌)లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొంతకాలం క్రితం రూ.2000-3000 కోట్ల మార్కెట్‌ విలువ సాధించటమే గొప్ప విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడి ఫార్మా కంపెనీలు రూ.10,000 కోట్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగి ఉండటం సాధారణ విషయంగా మారింది. ఈ స్థాయిలో ఇప్పటికే అయిదు కంపెనీలు కనిపిస్తుండగా, మరో రెండు ఈ మైలురాయికి దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా కంపెనీలు మదుపరుల సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నాయి.

Local pharma companies are competing in wealth creation
‘మార్కెట్‌ విలువ’లో పోటీపడుతున్న స్థానిక ఔషధ సంస్థలు
author img

By

Published : Sep 9, 2020, 10:05 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఇప్పుడు ఔషధ పరిశ్రమ ప్రధానమైన చోదక శక్తిగా మారింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫార్మా సిటీలు, బల్క్‌ డ్రగ్‌ పార్కులు ఏర్పాటు చేయటానికి, తద్వారా పరిశ్రమను ఇంకా ప్రోత్సహించటానికి చొరవ తీసుకుంటున్నాయి.

సూచీల్లో చోటు...

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో స్థానం సంపాదించటం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విషయం. అయితే, ఇప్పటికే స్థానిక అగ్రగామి ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో ఉంది. త్వరలో దివీస్‌ లేబొరేటరీస్‌ నిఫ్టీలోకి వెళ్లనుంది. అరబిందో ఫార్మా గతంలో సూచీల్లోకి వెళ్లినప్పటికీ మార్కెట్‌ విలువ తగ్గటంతో బయటకు రావాల్సి వచ్చింది. కానీ సమీప భవిష్యత్తులో ఈ కంపెనీకీ సూచీల్లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీలు ఒక్కొక్కటీ రూ.50,000 కోట్ల మార్కెట్‌ విలువను మించిపోయాయి.

కొవిడ్‌-19తో మరింత గిరాకీ

రోనా మహమ్మారి విస్తరించటంతో స్థానిక ఔషధ కంపెనీలు తయారు చేసే మందులకు అనూహ్యమైన గిరాకీ వచ్చింది. పారాసెటమాల్‌ నుంచి యాంటీ-వైరల్‌, యాంటీ-రిట్రోవైరల్‌ ఔషధాలు తయారు చేసే కంపెనీలకు అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. కొత్తగా కొవిడ్‌-19 ఔషధంగా వాడుకలోకి వచ్చిన ‘ఫావిపిరవిర్‌’ తయారీలో ఇక్కడి ఫార్మా కంపెనీలు క్రియాశీలకంగా వ్యవహరించాయి. ఈ పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు ఆదాయాలు, లాభాలు అనూహ్యంగా పెరగాయి. దీనివల్ల ఆయా కంపెనీల షేర్ల ధరలు రెట్టింపు అయ్యాయి.

మదుపరులకు లాభాల పంట

త రెండు దశాబ్దాల కాలంలో ఇక్కడి ఔషధ కంపెనీలపై పెట్టుబడి పెట్టిన మదుపరులకు భారీగా లాభాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో, దివీస్‌ షేర్లు కొనుగోలు చేసి పదేళ్ల పాటు ఎదురు చూసిన మదుపరుల పెట్టుబడి రెండు, మూడు రెట్లు పెరిగింది. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, సువెన్‌ ఫార్మా షేర్లు ఇటీవల శరవేగంగా పెరిగాయి. దీంతో వాటాదార్ల సంపద ఎంతగానో పెరిగింది. ఎవరెస్ట్‌ ఆర్గానిక్స్‌, టైచీ ఇండస్ట్రీస్‌... వంటి కంపెనీల షేర్ల ధరలు గత నాలుగు నెలల కాలంలో రెండు, మూడు రెట్లు పెరగటం గమనార్హం.

ఐడీపీఎల్‌తో మొదలైన ప్రస్థానం

హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమ ప్రస్థానం ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్‌తో మొదలైంది. స్ధానిక ఫార్మా కంపెనీల ప్రమోటర్లలో పలువురు ఐడీపీఎల్‌తో అనుబంధం ఉన్నవారే. 1980వ దశకంలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం లభించటంతో పలువురు ఔత్సాహికులు సొంతంగా ఫార్మా, బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు స్థాపించారు. మరికొందరు అమెరికాలో ఫార్మా రంగంలో అనుభవం గడించి వెనక్కి తిరిగి వచ్చి సొంత కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలు ఎన్నో ఔషధాలను ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌’ పద్ధతిలో ఆవిష్కరించి తక్కువ ధరకే దేశీయ, విదేశీ మార్కెట్లకు అందించటం ప్రారంభించాయి. ఇలా చిన్నగా మొదలైన ఫార్మా పరిశ్రమ శరవేగంగా ఎదిగింది. మలిదశలో విశాఖపట్టణం- శ్రీకాకుళం ప్రాంతాలకు తమ యూనిట్లను విస్తరించాయి. ఇవి కేవలం సాధారణ ఔషధాలు మాత్రమే కాకుండా ఎంతో సంక్లిష్టమైన యాంటీ- రిట్రోవైరల్‌, కేన్సర్‌ ఔషధాలు, ఇంజక్టబుల్స్‌ ఔషధాలు తయారు చేసే స్థాయికి ఎదిగాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఫార్మా కంపెనీలు ఇంకెంతో సంపద సృష్టిస్తాయని స్పష్టమవుతోంది.

వివరాలిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.