ETV Bharat / business

LIC IPO: డిస్కౌంట్​ కోసం ఎల్‌ఐసీ పాలసీదారులకు 28వరకు అవకాశం - ఎల్​ఐసీ ఐపీఓ అప్​డేట్స్​

LIC IPO: ఎల్​ఐసీ త్వరలోనే పబ్లిక్​ ఇష్యూకి రానుంది. పాలసీదార్లు ఐపీఓలో పాల్గొనాలంటే, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను నమోదు చేయించుకోవడం తప్పనిసరి అని తెలిపింది. పాన్‌ వివరాలను ఫిబ్రవరి 28 లోపు ఎల్‌ఐసీ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

LIC IPO
ఎల్​ఐసీ ఐపీఓ
author img

By

Published : Feb 16, 2022, 6:39 AM IST

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూలో (ఐపీఓ) పాలసీదార్లు పాల్గొనాలంటే, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను నమోదు చేయించుకోవడం తప్పనిసరి. ఈ నెల 13న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎల్‌ఐసీ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. దీని ప్రకారం, రూ.63,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో 5 శాతం వాటా లేదా 31.6 కోట్ల షేర్లను ప్రభుత్వం ఎల్‌ఐసీలో విక్రయించబోతోంది. వచ్చే నెలలో ఈ ఐపీఓ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎల్‌ఐసీ ఉద్యోగులు, పాలసీదార్లకు ఈ ఐపీఓలో రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం పాలసీదారు తమ పాన్‌ వివరాలను ఫిబ్రవరి 28(డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన రెండు వారాల్లోగా)లోపు ఎల్‌ఐసీ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నేరుగా తమ వెబ్‌సైట్‌ లేదా ఏజెంట్ల ద్వారా పాన్‌ను వివరాలు సమర్పించవచ్చని ఎల్‌ఐసీ పేర్కొంది.

ఐడీబీఐ బ్యాంక్‌కు అదనపు మూలధనం కేటాయిస్తే ఎల్‌ఐసీపై తీవ్ర ప్రభావం: ఐడీబీఐ బ్యాంక్‌కు అదనపు మూలధనం కేటాయిస్తే ఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. 2019 అక్టోబరు 23న ఐడీబీఐ బ్యాంక్‌లోకి రూ.4,743 కోట్లను ఎల్‌ఐసీ చొప్పించిన సంగతి తెలిసిందే. 'ఐడీబీఐ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితులు, కార్యకలాపాల ఫలితాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి ఆ బ్యాంకుకు మూలధనం సమీకరించాల్సిన అవసరం లేదు. ఒక వేళ అదనపు మూలధనం అవసరమై.. అది సమీకరించలేని పక్షంలో మేం అదనపు నిధులను జొప్పించాల్సి ఉంటుంది. ఇది మా ఆర్థిక పరిస్థితులు, కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చ'ని ఎల్‌ఐసీ దాఖలు చేసిన డీఆర్‌హెచ్‌పీలో ఉంది.

ఇదీ చూడండి:

India Export Growth: దేశ ఎగుమతుల్లో 25 శాతం వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.