లాక్డౌన్ వల్ల మద్యం టోకు, రిటైల్ వ్యాపారం అంతా స్తంభించిపోయిందని కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్(సీఐఏబీసీ) తెలిపింది. ప్రభుత్వం చొరవ తీసుకొని దశలవారీగా మద్య విక్రయానికి అనుమతివ్వాలని కోరింది. అన్లైన్ అమ్మకాలను సైతం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాసింది సీఐబీఓసీ.
" వివిధ పన్నుల ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించే పరిశ్రమ ఇది. దాదాపు 40 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది ఇతరులకు ప్రత్యక్షంగా ఈ రంగం ఉపాధి కల్పిస్తుంది. కరోనా నివారణ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం అమ్మకాలను చేపట్టాలనుకుంటున్నాం. పరిశ్రమను దీర్ఘకాలంగా మూసివేయడం వల్ల కంపెనీలపై ఆర్థిక భారం పడుతుంది. ఫలితంగా లక్షలాది మంది కార్మికులు నిరుద్యోగులుగా మారొచ్చు."
-వినోద్ గిరి, సీఐబీఓసీ డైరెక్టర్ జనరల్
మద్యం ఆన్‌లైన్ అమ్మకానికి అనుమతి ఇచ్చి... ప్రభుత్వం అవసరమైతే అదనంగా రుసుమును వసూలు చేసుకోవచ్చని పేర్కొన్నారు సీఐబీఓసీ డైరెక్టర్ జనరల్ గిరి. ఎక్సైజ్ సంవత్సరాన్ని జూన్ 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.