ETV Bharat / business

తొలి 'మేడ్​ ఇన్​ ఇండియా' 5జీ మొబైల్​​- ధర, ఫీచర్లు ఇవే..

5జీ స్మార్ట్​ఫోన్​ను మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి భారతీయ సంస్థగా లావా ఇంటర్నేషనల్​​ నిలిచింది. అగ్ని 5జీ(lava agni 5g)పేరుతో ఈ మొబైల్​ను విడుదల చేసింది. దీని ధర, ప్రత్యేకతలు, ఫీచర్లు ఓసారి చూద్దాం(lava agni 5g mobile).

Lava becomes first Indian brand to launch 5G smartphone
లావా నుంచి తొలి స్వదేశీ 5జీ స్మార్ట్ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..
author img

By

Published : Nov 9, 2021, 4:35 PM IST

Updated : Nov 9, 2021, 4:40 PM IST

భారత విపణిలోకి 5జీ స్మార్ట్​ఫోన్​ తీసుకొచ్చిన తొలి స్వదేశీ సంస్థగా అరుదైన ఘనత సాధించింది లావా ఇంటర్నేషనల్​. అగ్ని 5జీ(lava agni 5g) పేరుతో కొత్త మెబైల్​ను విడుదల చేసింది. ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలోని సంస్థ ప్లాంట్​లో దీన్ని తయారు చేసింది. భారత వినియోగదారులకు స్వదేశంలో రూపొందించిన 5జీ మొబైల్​ను(lava agni 5g mobile) అందుబాటులోకి తీసుకురావాలనే అగ్నిని లాంచ్ చేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మీడియాటెక్​ డైమెన్సిటీ 810 చిప్​సెట్​తో​ 5జీ స్మార్ట్​ఫోన్(lava 5g mobile) విడుదల చేసిన సంస్థల్లో ప్రపంచంలోనే తమది రెండో మొబైల్ కంపెనీ అని వెల్లడించింది.

అగ్ని ధర (lava agni 5g mobile price) రూ.19,999గా నిర్ణయించినట్లు లావా పేర్కొంది. ప్రస్తుతం భారత మార్కెట్​ను శాసిస్తున్న చైనా మొబైల్ సంస్థలకు దీటుగా ఉండాలనే ఇంత తక్కువకు 5జీ స్మార్ట్​ఫోన్ తీసుకొచ్చినట్లు చెప్పింది. ప్రీబుకింగ్ చేసుకునేవారికి ధర.. రూ.17,999 మాత్రమే అని తెలిపింది.

అగ్ని 5జీ ఫీచర్లు..

  • గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​తో 6.78 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్​ డైమెన్సిటీ 810 చిప్​సెట్
  • 8జీబీ రామ్​, 128 జీబీ మెమొరీ
  • 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా
  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్​(సెల్ఫీ) కెమెరా
  • 5000mAh బ్యాటరీ
  • 30W సూపర్ ఫాస్ట్ ఛార్జర్​

అగ్ని 5జీ స్మార్ట్​ఫోన్(lava agni 5g)​ నవంబర్ 18 నుంచి అన్ని రిటైల్ అవుట్​లెట్​లతో పాటు, ఫ్లిప్​కార్ట్, అమెజాన్​లో అందుబాటులో ఉంటుంది.

నవంబర్ 9 నుంచి రూ.500 చెల్లించి లావా ఈ-స్టోర్​, అమెజాన్​లో ఈ ఫోన్​ను(lava agni 5g mobile) ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.

Lava becomes first Indian brand to launch 5G smartphone
లావా నుంచి తొలి స్వదేశీ 5జీ స్మార్ట్ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..

ఇదీ చదవండి: ప్యాకేజ్డ్‌ వస్తువులకు యూనిట్‌ విక్రయ ధర

Last Updated : Nov 9, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.